header

Dharmavarapu Subrahmanyam…ధర్మవరపు శుబ్రహ్మణ్యం....

Dharmavarapu Subrahmanyam…ధర్మవరపు శుబ్రహ్మణ్యం....
Dharmavarapu Subrahmanyam…ధర్మవరపు శుబ్రహ్మణ్యం.... ఇతను సీనీ రంగంలోకి రాకమునుపు ప్రజానాట్యమండలి తరపున అనేక నాటకాలలో నటించాడు. తరువాత టీ.వీ రంగంలో ప్రవేశించాడు. ఇతని స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలు. బి.కాం చదువుతున్నపుడు సినిమాల మీద మోజుతో ఇంట్లో చెప్పకుండా మద్రాసు వెళ్లాడు. కాని అవకాశాలు రాకపోవటంతో తిరిగి స్వస్థలం చేరుకున్నాడు. పంచాయితీ శాఖలో అధికారిగా చేరాడు. ఆకాశవాణి రేడియో కోసం నాటకాలు రాయటం మొదలు పెట్టాడు. ఆనందో బ్రహ్మతో తెలుగువారికి దగ్గరయ్యాడు.
తొలిసారిగా జంధ్యాల సినిమా జయమ్ము, నిశ్చయమ్మురాలో అవకాశం వచ్చింది. చాలా సినిమాలలో అధ్యాపక పాత్రలను పోషించాడు. తరువాత ఒక్కడు, వర్షం, ఆలస్యం అమృతం సినిమాలో నటించి నంది అవార్డును అందుకున్నాడు. రాజకీయాలలో చేరి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నాడు. ఇతనికి ఇద్దరు కుమారులు, భార్య ఉన్నారు.
ఇతను 1954 సెప్టెంబర్ 20వ తేదీన ప్రకాశం జిల్లా కొమ్మినేనివారి పాలెం గ్రామంలో జన్మించాడు. కాలేయ క్యాన్సర్ తో బాధపడుతూ 2013 డిసెంబర్ ఏడవ తేదీన హైదరాబాద్ లో మరణించాడు.

తెలుగువారి కోసం తెలుగు వెబ్ సైట్...తెలుగు కిరణం.. Telugu Website for Telugu People..
Websites in English and Telugu Languages will be designed… Telugu Unicode Fonts..will be typed for Telugu websites…
at reasonable rates... for further details click contact us