1970 నుండి 1980 వరకు తెలుగు సీనీ జగత్తులో విలన్ గా, హాస్యనటునిగా పేరుపొందిన నూతన్ ప్రసాద్ అసలు పేరు తడినాధ వరప్రసాద్. ఇతను 1945 డిసెంబర్ 12వ తేదీన కృష్ణాజిల్లా కైకలూరులో జన్మించాడు. .
సీని రంగానికి రాకముందు హైదరాబాద్ లో ప్రభుత్వ ఉద్యోగం చేసేవాడు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన అందాల రాముడు చిత్రంలో తొలిసారిగా నటించాడు. తరువాత నీడలేని ఆడది సినిమాలో నటించాడు. ఇతను రావుగోపాలరావుతో పాటు విలన్ గా నటించిన ముత్యాలముగ్గు సినిమా ఇతని సీనీ జీవితాన్ని మలుపు తిప్పింది. అప్పటి నుండి వెను తిరిగి చూసుకోలేదు. నూటొక్క జిల్లాల అందగాడుగా పేరుబడ్డాడు. ఇతని సంభాషణలు ప్రత్యేక శైలిలో ఉండేవి. .
ఆనాటి ఆగ్రతారలు రామారావు, నాగేశ్వరావు, చిరంజీవి, కృష్ణలతో పాటు నటించాడు. రాజాధిరాజ సినిమాలో సైతాన్ గా నటించి పేరుతెచ్చుకున్నాడు. సుందరి సుబ్బారావు చిత్రంలో నటించి నంది అవార్డు అందుకున్నాడు. బామ్మమాట బంగారుబాట సినిమా చిత్రీకరణ సినిమాలో దురదృష్ట వశాత్తూ జరిగిన ప్రమాదంలో గాయపడ్డాడు. కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండి కోలుకున్నాడు కానీ కాళ్లు, చేతులు పనిచేయలేదు. తరువాత సినిమాలలో చిన్న చిన్న కదలికలు లేని పాత్రలు ధరించాడు. .
ఎంతటి కష్టమైన సన్నివేశంలోనైనా సునాయాసంగా నటించేవాడని అంటారు. ఇతని జ్ఞాపకశక్తి కూడా గొప్పది. ఎంత పెద్ద డైలాగులనైనా ఒకే షాట్ లో చెప్పేవాడంటారు. వైవిద్యభరితమైన పాత్రలు పోషించాడు. అందరితోనూ కలుపుగోలుగా ఉండేవాడంటారు. .
ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఇతను 2011 మార్చి 20వ తేదీన మరణించాడు. .