ఇతను తెలుగు చిత్రసీమలో హాస్యనటునిగా పేరుగాంచాడు. రేడియో మరియు నాటకరంగాలలో కూడా ప్రవేశం ఉంది. ఇతని స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా. 1947 జూన్ 6వ తేదీన జన్మించాడు. ఇతని అసలుపేరు మామిడిపల్లి వీరభద్రరావు. .
ఇతను సీనీరంగానికి రాకముందు ఆకాశవాణి విజయవాడలో 20 సంవత్సరాల పాటు పనిచేసాడు. తరువాత బలిపీఠం సినిమాలో తొలిసారిగా నటించాడు. నాలుగుస్తంభాలాటలో నటించాడు. అప్పటినుండి సుత్తి వీరభద్రరావుగా పేరుపొందాడు. ఇందులో ఇతనితో పాటు నటించిన వేలు ఇతను కలిసి సుత్తి జంటగా పేరుపడ్డారు. దాదాపు 50 సినిమాలలో నటించాడు. .
ఇతను నటించిన కొన్నిసినిమాలు...మంత్రిగారబ్బాయి, రెండుజళ్ల సీత, శ్రీవారికి ప్రేమలేఖ, స్వాతిముత్యం, చంటబ్బాయి, అహ నాపెళ్లంట. .
తరువాత కాలంలో అనారోగ్యంతో హాస్పటల్ లో వైద్యం కోసం చేరాడు. వైద్యం వికటించి 1988 జూన్ 30వ తేదీన మరణించాడు.