తెలుగు చిత్రసీమలో సుత్తివేలుగా ప్రసిద్ది చెందిన ఇతని అసలుపేరు కురుముద్దాలి లక్ష్మీ నరసింహారావు. ఈ హాస్యనటుడు సుమారు 200 చిత్రాలతో పాటు కొన్ని టెలివిజన్ సీరియళ్లలో కూడా నటించాడు. ఇతను చిన్నతనంలో నాటకాల పట్ల ఆసక్తితో పి.యు.సి చదివిన తరువాత హైదరాబాదుకు వచ్చాడు. తరువాత బాపట్లకు తన మకాం మార్చాడు.
1961లో విశాఖపట్నం డాక్ యార్డులో ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఉద్యోగం చేస్తూనే నాటకాలు వేసేవాడు. అంతా ఇంతే నాటకం ఇతనికి మంచి పేరు తెచ్చింది. తరువాత ముద్దమందారం సినిమాలో చిన్న పాత్రలో నటించాడు. తరువాత మల్లె పందిరి, నాలుగుస్తంభాలాట సినిమాలలో నటించాడు. నాలుగు స్తంభాలాటలో ఇతని పేరు సుత్తి. ఈ సినిమా విజయవంతమైంది. అక్కడి నుండి ఇతనిని సుత్తివేలుగా పిలవటం జరిగింది. .
తరువాత ఆనందభైరవి, రెండుజళ్ల సీత, చంటబ్బాయి చిత్రాలలో నటించాడు.తరువాత కొద్ది కాలం అవకాశాలు రాకపోవటంతో ఇబ్బంది పడ్డాడు. కానీ తరువాత వరుసుగా వందేమాతరం, ప్రతిఘటన, కలికాలం, ఒసేయ్ రాములమ్మ, చిత్రాలలో నటించి హాస్యనటునిగా స్థిరపడ్డాడు. వందేమాతరం సినిమాకు ఉత్తమ హాస్యనటునిగా నంది అవార్డు అందుకున్నాడు. .
సుత్తివేలు భార్య రాజ్య లక్ష్మి. ఈ దంపతులకు ముగ్గరు అమ్మాయులు, ఒక అబ్బాయి సంతానం. చివరిదశలో అనారోగ్యంతో బాధపడుతూ 2012 సెప్టెంబర్ 15వ తేదీన మద్రాసులో మరణించాడు.