వేణు మాధవ్ సీనిరంగానికి రాకముందు మిమిక్రి కళాకారుడుగా పేరుపొందాడు. సంప్రదాయం తెలుగు సినిమాలో తొలిసారిగా నటించాడు. ఇతని స్వస్థలం తెలంగాణా సూర్యాపేటలోని కోదాడ. కోదాడలోనే డిగ్రీదాకా చదువుకున్నాడు. విద్యార్థిగా ఉన్నప్పుడే ప్రముఖ తారలను అనుకరించి మిమిక్రీ చేసి, డాన్స్ కూడా చేసేవాడు.
తరువాత చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ వచ్చాడు. దిల్, లక్ష్మి సినిమాలలో నటించాడు. లక్ష్మి సినిమాకు నంది అవార్డును అందుకున్నాడు. అక్కడనుండి తన సీనీ జీవితంలో వెనుతిరిగి చూడలేదు. ప్రియమైన నీకు, స్టూడెంట్ నెం.1, ఆది, దిల్, సింహాద్రి, వెంకీ, ఆర్వ, ఛత్రపతి, బన్నీ, శకర్ దాదా యం.బి.బి.యస్ సినిమాలలో నటించి కమెడియన్ గా స్థిరపడ్డాడు. ఇతను తన పుట్టిన రోజలను అనాధాశ్రయంలో జరుపుకొని అనాధలకు కేక్ పంచేవాడు.
ఇతను కోదాడలో 1969 సెప్టెంబర్ 28వ తేదీన జన్మించాడు. 2019 సెప్టెంబర్ 25వ తేదీన కాలేయవ్యాధితో బాధపడుతూ మరణించాడు.