ఈమె అచ్చ తెలుగమ్మాయి. తెలుగు హాస్యనటి శ్రీ లక్ష్మికి మేనకోడలు. 1990 సం.జనవరి 10వ తేదీన చెన్నై లో జన్మించింది. చెన్నైలోనే బి.కామ్ చదువుకున్నారు.
తమిళ టి.విలో యాంకర్ గా పనిచేసి తరువాత తమిళ చిత్రాలలో నటించారు. తరువాత మళయాళ సినిమాలలో నటించింది. తమిళంలో 2004 లోఈమె నటించిన మత్తయి కాక సినిమాకు ఉత్తమ నటిగా తమిళనాడు చలన చిత్రపరిశ్ర నుండి అవార్డు అందుకుంది. ఈ సినిమాలో మురికివాడలలో ఇద్దరు పిల్లల తల్లిగా నటించింది.
‘కౌసల్యా కృష్ణమూర్తి’ తెలుగు సినిమాతో చిత్రరంగంలో ప్రవేశించింది. క్రికెట్ గురించి అవగాహన లేకపోయినా కేవలం ఆరు నెలలో క్రికెట్ నేర్చుకుని డూప్ లేకుండా సిక్సర్లు కొట్టి ప్రేక్షకుల మెప్పు పొందింది.
ఇటీవల విడుదలైన మిస్ మ్యాచ్ సినిమాలో నటించింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రంలో నటిస్తుంది