అనుష్కా షెట్టి... తెలుగు మరియు తమిళ సినిమాల ప్రముఖ నటి మరియు మోడల్ కూడ. ఈమె 1981 నవంబర్ 7వ తేదీ పుత్తూరులో(మంగుళూరు, కర్నాటక) జన్మించింది. అనుష్కా అసలు పేరు స్వీటీ షెట్టి. ఈమె తండ్రివిఠల్ షెట్టి. తల్లి ఫ్రఫుల్ షెట్టి.
అనుష్కా సినీ రంగానికి రాకముందు బెంగుళూరులో యోగా శిక్షకురాలుగా పనిచేసింది. ఈమె యోగా గురువు భరత్ ఠాగూర్. అనుష్కా ఉన్నత విద్యావంతురాలు. బెంగుళూరులోని మౌంట్ కార్మెల్ కళాశాలనుండి బి.సి.ఏ డిగ్రీ చేసింది.
నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమాలో హీరోయిన్ గా తెలుగు సినిమా రంగంలో ప్రవేశించింది. తరువాత ఈమె నటించిన విక్రమార్కుడు, లక్ష్యం సినిమాలు విజయం సాధించాయి.
అనుష్కా నటించిన తెలుగు సినిమాలలో 2009 జనవరిలో వచ్చిన ‘అరుంధతి’ ఈమె జీవితంలో ఒక మైలు రాయి. ఈ సినిమా ఈ సినిమా గొప్ప విజయాన్ని సాధించి అనుష్కాను కూడా ఒక గొప్ప నటిగా నిలబెట్టింది.
తరువాత కూడా ఈమె నటించిన బాహుబలి-2, సింగం, భాగమతి మొదలగు సినిమాలు విజయాలను సాధించాయి.