ఈమె హిందీ సినిమాలతో పాటు తమిళ తెలుగు, ఇంగ్లీష్ సినిమాలలో కూడా నటించింది. భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకరు. ఈమెను మీడియా సెక్స్ సింబల్ గా పేర్కొంది.
1979 జనవరి 7 ఢిల్లీలో ఓ బెంగాలీ కుటుంబంలో పుట్టింది. కానీ పెరిగింది మాత్రం కలకత్తాలో. 2001 సం.లో అజ్ నబీ చిత్రంలో ప్రతికూల పాత్ర ధరించి సినిమారంగంలో ప్రవేశించింది. ఈ సినిమాలో తన నటనకు ఫిలింఫేర్ అవార్డును కూడా సంపాదించింది. తరువాత జిస్మ్, కార్పోరేట్, నో ఎంట్రీ, ఫిర్ హేరాఫేరి, ఆల్ ద బెస్ట్, ధూం-2,రేస్, రాజ్ 30 మొదలగు సినిమాలలో నటించింది.
కొన్ని సినిమాలలో ఐటం సాంగ్ లలో కూడా నటించింది. ఈమె భర్త కరణ్ సింగ్ గ్రోవర్.