ప్రముఖ బాలీవుడ్ నటి మరి మోడల్ దీపికా పడుకోనే డెన్మార్క్ లోని కోపెన్ హగ్ లో 1986 సం. జనవరి 5 వ తేదీన జన్మించింది. ఈమెకు 11నెలల వయస్సులో వీరి కుటుంబం బెంగుళూరుకు వచ్చింది 2018లో బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ ను వివాహం చేసుకుంది.
ఈమె తండ్రి ప్రకాష్ పడుకునే అంతర్జాతీయంగా పేరుపొందిన బ్యాడ్మింటన్ ఆటగాడు.
2018 లో నిర్వహించిన సర్వేలో ప్రపంచంలోనే పేరుపొందిన 100 మంది మహిళలో స్థానం సంపాదించుకుంది. బెంగుళూరులోని మౌంట్ కార్మెల్ కళాశాలలో ప్రీ యూనివర్శటి కోర్సు పూర్తి చేసింది.
లిరిల్, డాబర్, లిమ్మా ఉత్పత్తులకు మోడల్ గా పనిచేసింది
కన్నడ సినిమా ఐశ్వర్యతో సినీ రంగ ప్రవేశం చేసింది. షారూక్ ఖాన్ తో నటించిన ఒం శాంతి ఓం, మద్రాస్ ఎక్స్ ప్రెస్ సినిమాలు విజయవంతమైనాయి.
ఫైండింగ్ ఫన్నీలో వితంతువు పాత్రలో సహజంగా నటించి పేరుపొందింది. పీకూ తో కూడా పేరుపొందింది. బాజీరావు మస్తానీ, పద్మావత్ సినిమాలు ఈమెను అందలం ఎక్కించాయి.