ఇలియానా 1987 నవంబర్ 1 తేదీన ముంబాయిలో జన్మించింది. ముంబాయిలోనే పెరిగిన ఈమె గోవాలో స్థిరపడింది. యూనివర్శిటీ ఆఫ్ ముంబాయిలో డిగ్రీ చదివింది
2006 సం.లో ఈమె రామ్ తోపాటు హీరోయిన్ గా తొలిసినిమా దేవదాసు సినిమాలో నటించింది. తొలి సినిమాతోనే గుర్తింపు పొందింది. ఈ సినిమా సంచలనాత్మక విజయం సాధించింది.
తరువాత మహేష్ తో నటించి పోకిరి ఈమెకు పేరు తెచ్చిపెట్టంది. జూనియర్ ఎన్.టి.ఆర్ తో నటించిన రాఖి, ప్రభాస్ తో నటించిన మున్నా చిత్రాలు విజయవంతమైనవి.
తరువాత హిందీ చిత్రరంగంలోకి వెళ్లింది. దీంతో తెలుగు మరియు దక్షణాది సినిమాలలో అవకాశాలు కోల్పోయింది.