ఈమె శ్రీలంక జాతీయురాలు. స్వస్థలం కొలంబో, శ్రీలంక. మోడల్ మరియు సీని నటి. 2006 సం.లో మిస్ యూనివర్శ్ శ్రీలంకగా కిరీటం దక్కించుకుంది. మాస్ కమ్యునికేషన్ లో డిగ్రీ, సిడ్నీ యూనివర్శిటీలో చేసింది.
2006 సం.లో అలాడిన్ హింది సినిమాతో హిందీ చలన చిత్ర రంగంలో ప్రవేశించింది. 2011 సం.లో ఈమె నటించిన మర్డర్-2 విజయవంతమయింది. అప్పటి నుండి ఈమెకు గ్లామర్ సినిమాలు వచ్చాయి. తరువాత ఈమె నటించిన హౌస్ ఫుల్-2, రేస్ – 2 1 బిలియన వసూళ్లు సాధించాయి. హిందీలో ఈమె నటించిన కిక్ భారత దేశంలో ఎక్కువగా వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది.
ఈ శ్రీలంక బ్యూటీ క్వీన్ హిందీ నటుడు సల్మాన్ ఖాన్ సలహాలు,సూచనలు పాటిస్తుంది. ఈమె నటన కంటే డ్యాన్స్ లను ప్రేక్షకులు ఇష్టపడతారు.
ఈమె 1985 ఆగస్టు 11 న బహ్రైన్ లోని మనామాలో జన్మించింది.