లావణ్యా త్రిపాఠి 2006 సం.లో మిస్ ఉత్తరాఖండ్ గా ఎన్నుకోబడ్డది. లావణ్యా త్రిపాఠి తండ్రి హైకోర్టు న్యాయవాది. తల్లి విశ్రాంత ఉపాధ్యాయుని. లావణ్య ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో జన్మించింది. ఈమె ముంబాయిలోని రిషి దయారాం కాలేజ్ లో ఆర్ధిక శాస్త్రంలో డిగ్రీ చదివింది.
2012 సంవత్సరంలో తెలుగు సినిమా రంగంలో ప్రవేశించింది. ఈమె మెదటి సినిమా ‘అందాల రాక్షసి’(2012) తరువాత భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయనా. శ్రీరస్తు శుభమస్తు, లచ్చిం దేవికి ఓ లెక్కుంది తెలుగు సినిమాలలో నటించిది.
2017 సం.లో మిస్టర్ సినిమాలోనూ, 2019 సం.లో అర్జున్ సురవరంలో కూడా నటించింది. ఈమె తమిళ సినిమాలలో కూడా నటించింది.