మాధురి దీక్షిత్ 1967 సం. మే నెల 15వ తేదీన ముంబాయిలో జన్మించింది. ప్రముఖ బాలీవుడ్ (హిందీ) సినిమా నటి మరియు అత్యధిక పారితోషికం తీసుకునే వాళ్లలో ఒకరు.
ఈమె నాట్యంలో కూడా ప్రవీణురాలు. హిందీ నటీమణులలో విజయవంతమైన నటీమణి. ఈమె నటనకు 2008 సంవత్సరంలో భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ బిరుదుతో సత్కరించింది.
ఈమె మరాఠీ బ్రాహ్మణ కుటుంబానికి చెందినది.
ఈమె నటించిన పరిందా, రాంలఖన్, త్రిదేవ్, కిషన్ కన్నయ్య, దిల్, సాజన్, ఖల్ నాయక్ మొదలగు సినిమాలు అన్నీ విజయవంతమైనాయి. ఈమెకు ఫిల్మ్ ఫేర్ అవార్డును కూడా తెచ్చిపెట్టాయి.
హమ్ ఆప్ కే హై కౌ సినిమా విజయవంతమై భారత్ లో సుమారు 650 మిలియన్ల రూపాయలు వసూలు చేసింది.
ఈమె 1999 సం.లో అమెరికాలో స్థిరపడిన భారతీయ వైద్యులు శ్రీరాంను వివాహమాడింది.