ఈమె అసలు పేరు దియానా మరియం కురియన్. 1984 సం. 18 నవంబర్ న బెంగుళూరులో పుట్టింది. కేరళలోని తిరువళ్ల ఈమె స్వస్థలం. ఇంగ్లీష్ లిటరేచర్ లో బ్యాచలర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేసింది. ఈమె తండ్రి కురియన్ కొడియాట్టు.
‘మనస్సి నక్కరే’ మళయాళ సినిమాతో చలన చిత్రాలలో రంగప్రవేశం చేసింది. తరువాత మోహన్ లాల్, ముమ్ముట్టి వంటి పెద్దహీరోలతో మళయాళ సినిమాలలో నటించింది.
తమిళంలో గజని, అయ్య, చంద్రముఖి సినిమాలలో నటించింది. ఈమె తెలుగులో నటించిన బాస్, లక్ష్మి చిత్రాలు విజయవంతమైనాయి.
తెలుగు సినిమా రామరాజ్యంలో ఈమె నటించిన సీతాదేవి పాత్రకు ఫిలిమ్ ఫేర్, నంది అవార్డులు లభించాయి. ఈ సినిమాకు ఫిల్మ్ ఫేర్, నంది అవార్డులు వచ్చాయి.
మొదట ఈమె తన సహనటుడు శింబుతో ప్రేమలో పడి విడిపోయినట్లు తరువాత ప్రభుదేవాను పెళ్ళిచేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి కానీ పెళ్లి మాత్రం జరగలేదు.
తెలుగులో ప్రభాస్ తో యోగి, రవితేజాతో దుబాయ్ శీను, నందమూరి తారక్ తో అదుర్స్, వెంకటేష్ తో తులసి తెలుగు సినిమాలలో నటించింది. రజనీ కాంత్ తో ఈమె నటించిన ‘చంద్రముఖి’ గొప్ప విజయాన్ని సాధించింది.