రకుల్ ప్రీతి సింగ్ తెలుగు, తమిళ చిత్రాల నటి మరియు మోడల్ కూడా. కొన్ని హిందీ, కన్నడ సినిమాలలో కూడా నటించింది. ‘బేటీ బచావో, బేటీ పఢావో’ కు ఈమెను తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది.
1990 అక్టోబర్ 10 వ తేదీన న్యూఢిల్లీలో జన్మించింది. ఈమె పంజాబీ కుటుంబానికి చెందినది. ఢిల్లీ యూనివర్శిటీలో మేధమెటిక్స్ లో డిగ్రీ చేసింది. .
తెలుగులో మొదటి సారిగా 2011 పం.లో ‘కెరటం’ సినిమాలో నటించింది. ఆ తరువాత వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లో నటించింది. 2012 సం.లో తమిళ సినిమా Thadaiyara Thaakka లో నటించింది.
కరెంట్ తీగ, లౌక్యం, కిక్ 2, నాన్నకు ప్రేమతో, జయ జానకీ నాయక తెలుగు సినిమాలలో నటించి తక్కువ సమయంలో దక్షిణాది సినిమాలలో స్థిరపడింది.