దక్షిణాది ప్రముఖ హీరోయిన్లలో సమంత ఒకరు. ఈమె తెలుగు, తమిళ సినిమాల నటి. 1987 ఏప్రియల్ 28వ తేదీన చెన్నైలో జన్మించింది. సమంత అసలు పేరు సమంత రూత్ ప్రభు.
2010 సంవత్సరంలో విడుదైన ‘ఏ మాయ చేసావే’ సినిమాతో తెలుగు చలనచిత్ర రంగంలో ప్రవేశించింది. తరువాత బృందావనం. దూకుడు, ఎటోవెళ్లి పోయిందే మనసు, అత్తారింటికి దారేది సినిమాలలో నటించి హీరోయిన్ గా అతి తక్కువ కాలంలో స్థిరపడింది. సమంతా నటించిన ‘ఈగ’ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. .
2013సం. తెలుగులోనూ, తమిళం లో దక్షిణ భారత ఫిలిం ఫేర్ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది.
సమంత 6 అక్టోబర్, 2017 సం.లో పద్మశ్రీ అక్కినేని నాగేశ్వరరావు మనవడు, తెలుగు ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున కుమారుడు నాగచైతన్యను వివాహమాడింది.