1987 మార్చి 3 వ తారీకున ముంబాయిలో జన్మించింది. ఈమె తండ్రి హిందీ సినిమాలలో విలన్ మరియు సపోర్టింగ్ క్యారెక్టర్ లలో నటించే శక్తికపూర్. తల్లి శివాంగి కొల్హాపురి ఈమెకూడా హింది సినిమా నటి.
2010సం.లో తీన్ పట్టి అనే సినిమాలో చిన్న పాత్రద్వారా సీనీరంగంలో ప్రవేశించింది. తరువాత 2014లో ఏక్ విలన్, 2015లో ABCD, 2016లో భాగీ సినిమాలలో నటించి విమర్శల ప్రశంశలు అందుకుని హిందీ సినిమారంగంలో స్థిరపడింది.
నటిగా కాకుండా చాలా సినిమాలలో పాటలు కూడా పాడింది.. చాలా కంపెనీల ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తుంది.
2013 లో ఈమె సింగర్ గా నటించిన చిత్రం ఆషిక్-2 చిత్రానికి ఉత్తమనటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డుకు నామినేట్ అయింది.
తెలుగులో సాహోలో ప్రభాస్ తో హిరోయిన్ గా నటించింది. అత్యధిక పారితోషకం తీసుకునే నటులలో ఈమె ఒకటి.
అమెరికాలోని బోస్టన్ యూనివర్శిటీలో చదువుతూ మధ్యలోనే చదువు మానేసింది.