తాప్సీపన్ను 1987 ఆగస్ట్ 1వ తేదీన న్యూ ఢిల్లీలో జన్మించింది. తెలుగు, తమిళం, మలయాళ, హిందీ సినిమాలలో నటిస్తుంది. కంప్యూటర్ సైన్స్ లో బి.టెక్ డిగ్రీ చేసింది. తండ్రి దిల్ మోహన్ సింగ్ పన్నూ. వీరిది సింగ్ ల కుటుంబం.
మోడలింగ్ నటిగా పనిచేస్తూ ఝమ్మంది నాదం తెలుగు సినిమా ద్వారా సీనీరంగ ప్రవేశం చేసింది. గుండెల్లో గోదావరి, దరువు, మొగుడు, వీర తెలుగు సినిమాలలో నటించింది. హిందీ సినిమా రంగంలో ప్రవేశించి హిందీ నటిగా కూడా విజయాలు అందుకుంది