వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ సినిమాల నటి. ఈమె 1985 మార్చి 5వ తేదీన బెంగుళూరులో జన్మించింది.
పొద్ద పొడి తమిళ సినిమాతో సీనీ రంగంలో ఆరంగేట్రం చేసింది. ఒకప్పుడు తెలుగు చిత్రాలలో నటించిన హీరోయిన్ రాధిక ఈమెకు సవతి తల్లి. ఈమె ఉన్నత విద్యావంతురాలు. మైక్రో బయాలజిలో డిగ్రీ చేసింది. తరువాత ఎడిన్ బర్గ్ యూనివర్శిటీలో యం.బి.ఎ పూర్తిచేసింది.
ఈమె రెండవ సినిమా మాణిక్య కన్నడ సినిమా సుదీప్ తో కలసి నటించింది. తెనాలి రామకృష్ణ, క్రాక్, నంది తెలుగు సినిమాలలో నటించింది.