Vidya Balan… విద్యాబాలన్ హిందీ సినిమాల హీరోయిన్. ఓరియంటెడ్ సినిమాలలో ముందు వరుసలో ఉంటుంది.
ఇష్కియా, పా, నో వన్ కిల్డ్ జెస్సికా, కహానీ, ది డర్టీ పిక్చర్ సినిమాలలో నటనా సౌరభాలను విరజిమ్మింది. అత్యధిక పారితోషకం తీసుకునే భారతీయ నటీమణులలో ఒకరు.
జనవరి1, 1978 సంవత్సరంలో పూతమ్ కురిస్సీ, పాలక్కాడ్, కేరళలో జన్మించింది. ముంబాయి ఈమె నివాసం. ఈమె భర్త నిర్మాత మరియు వ్యాపారవేత్త ఐన సిద్ధార్ధా రాయ్ కపూర్.