అల్లరి నరేష్ తెలుగు సినిమాల నిర్మాత మరియు దర్శకుడు ఇ.వి.వి. సత్యనారాయణ కుమారుడు. ఇతను 1982 జూన్ 30వ తేదీన జన్మించాడు. 2015 సం.లో కంటమనేని విరూపతో ఇతని వివాహం జరిగింది. నరేష్ సినిమాలు హాస్యభరితంగా ఉంటాయి. అల్లరి అనే సినిమాలో నటించటం వలన నరేష్ పేరు అల్లరి నరేష్ గా మారింది.
గమ్యం సినిమాలో సహాయ నటుడిగా వైవిధ్యమైన పాత్రలో కనిపించాడు. ఈ సినిమాలో ఇతను సహాయనటుడిగా ఫిలిం ఫేర్ మరియు నంది అవార్డులు అందుకున్నాడు. తరువాత అల్లడు వెరీ గుడ్ లో నటించి మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. నువ్వంటే నాకిష్టం, డేంజర్, కితకితలు సినిమాలలో నటించాడు. కితకితలు మంచి హాస్యచిత్రంగా విజయవంతమైంది.
సుడిగాడు, శివశివ శంభో, కెవ్వుకేక, సుందరకాండ, పెళ్లికాని ప్రసాద్, విశాఖ ఎక్స్ ప్రెస్, యముడికి మొగుడు, అహ నా పెళ్లంట, సంఘర్షణ, ఇంకా అనేక హాస్యభరిత సినిమాలలో నటించాడు.