సినిమా నేపథ్యంగల కుటుంబంలో నుంచి వచ్చిన అల్లు అర్జున్ తొలి సినిమా ‘గంగోత్రి’ తెలుగులో గొప్ప విజయాన్ని సాధించింది. అంతకు ముందు చిరంజీవి, సిమ్రాన్ లు నటించిన డాడీ సినిమాలో డ్యాన్సర్ గా కనబడ్డాడు. .
ఇతను 1983 ఏప్రియల్ 8వ తేదీన చెన్నైలో జన్మించాడు. హైదరాబాద్ లోని MSR కాలేజ్ లో BBA చదువుకున్నాడు. ఇతను ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య మనవడు. నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు. చిరంజీవికి మేనల్లుడు. ఇతనికి తెలుగులోనే కాకుండా బెంగుళూరు, కేరళలలో కూడా అభిమానులున్నారు. ఇతను జిమ్నాస్టిక్స్, మార్షల్ ఆర్ట్స్ లో నిపుణుడు. .
అల్లు అర్జున్ బద్రీనాధ్, రేసుగుర్రం, ఎవడు, రుద్రమదేవి, దువ్వాడ జగన్నాధం, జులాయి, వేదం, దేశముదురు, నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా, అల వైకుంఠపురంలో సినిమాలలో నటించాడు. .
ఇతని భార్య స్నేహారెడ్డి. ఈ దంపతులకు 2014లో మగపిల్లవాడు పుట్టాడు (అల్లు ఆయాన్) 2016 పాప పుట్టింది (అల్లు అర్హ)