తెలుగు సినిమాలలో ప్రఖ్యాత నటుడు మరియు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సంచలనం సృష్టించిన మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ యన్.టి.రామారావుకు ఆరవ సంతానం బాలకృష్ణ. ఇతను 1960 జూన్ 10వ తేదీన నేటి చెన్నైలో జన్మించాడు. ఇతను ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాకు తెలుగుదేశపు తరపున యం.యల్.ఏ.
తాతమ్మ కల సినిమాలో బాలనటుడిగా సీనీ రంగంలో ప్రవేశించాడు. తరువాత అనేక తెలుగు సినిమాలలో హీరోగా నటించి పేరుపొందాడు. జానపద, పౌరాణికాలలో కూడా తిరుగులేని నటుడిగా పేరుపొందాడు.
మంగమ్మగారి మనవడు, జననీ జన్మభూమి, అపూర్వ సహోదరులు, నారీ నారీ నడుమ మురారీ, బంగారు బుల్లోడు, ఆదిత్య 369 ఇంకా అనేక విజయవంతమైన తెలుగు సినిమాలలో నటించాడు.
తెలగులో యన్.టి.రామారావు నటించిన పౌరాణిక చిత్రం ‘లవకుశ’ రీమేక్ ‘రామరాజ్యం’ లో రాముడిగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ‘ భైరవద్వీపం’ జానపద సినిమాకు గాను ఉత్తమ నటుడుగా ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకున్నాడు. నరసింహనాయుడు, సింహ, లెజెండ్ సినిమాలకు నంది అవార్డులు అందుకున్నాడు.
బాలకృష్ణ 100వ సినిమా చరిత్ర ఆధారంగా నిర్మించిన ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ లో శాతకర్ణిగా నటించాడు.
స్వర్గీయ యన్.టి.రామారావు సతీమణి బసవతారకం పేరు మీద హైదరాబాద్ లో ఏర్పాటు చేయబడ్డ ‘బసవతారం ఇండో అమెరికన్ కేన్సర్ హాస్పటల్’ కు బాలకృష్ణ ఛైర్మన్ పదవిలో ఉన్నారు.