జగపతి బాబు తన 25 సంవత్సరాల సుదీర్ఘ సీనీ జీవితంలో 7 సార్లు నంది అవార్డులు, 4 ఫిలిం ఫేర్ అవార్డులు అందుకున్నాడు. ఇతను 1962 ఫిబ్రవరి 12వ తేదీన ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నం(బందర్)లో జన్మించాడు. ఇతను ప్రముఖ తెలుగు చిత్రనిర్మాత, మరియు దర్శకుడు వి.బి. రాజేంద్ర ప్రసాద్ కుమారుడు.
1989 సం.లో సింహస్వప్నం సినిమాలో రెండు పాత్రలు పోషించి చిత్రరంగంలో ప్రవేశించాడు. ఈ సినిమా తరువాత ఇతను నటించిన సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు. రాంగోపాల్ వర్మ సినిమా ‘గాయం’ తో హీరోగా స్థిరపడ్డాడు. 1994 లో ఇతను నటించిన శుభలగ్నం కూడా విజయవంతమైనది. అంతఃపురం, సముద్రం, మనోహరం, శివరామరాజు, హనుమాన్ జంక్షన్ వంటి సినిమాలలో హీరోగా నటించాడు.
తన సీనీ జీవితంలో రెండవ అంకంలో విలన్ గా నటిస్తూ తెలుగు సినిమాలలో గొప్ప విలన్ గా పేరుతెచ్చుకున్నాడు. 2014లో లెజెండ్ లో, 2015లో శ్రీమంతుడు, 2016లో నాన్నకు ప్రేమతో, 2016లో మన్యంపులి, 2018 సం.లో రంగస్థలంలో ప్రతినాయకుని పాత్ర పోషించి విలన్ పాత్రల లోటు తీర్చాడు.