ఇతను తెలుగు సీనిరంగంలో, రాజకీయాలలో తిరుగులేని స్థానం సంపాదించుకున్న నందమూరి తారకరామారావు వంశంలో అదే పేరుతో జూనియర్ యన్.టి.ఆర్ గా స్థిరపడ్డాడు. .
1983 మే 20వ తేదీన హైదరాబాద్ లో జన్మించాడు. ఇతని తండ్రి నందమూరి హరికృష్ణ, తల్లి షాలినీ భాస్కర్. సెయింట్ మేరీ స్కూల్లో ఇంటర్ మీడియట్ చదువుకున్నాడు. కూచిపూడి డ్యాన్స్ లో శిక్షణ తీసుకున్నాడు.
బాలరామాయణంతో తెలుగు సినిమా రంగంలో ప్రవేశించి, రాజమౌళి దర్శకత్వం వహించిన స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో తెలుగు చిత్రరంగంలో విజయం సాధించాడు. తరువాత 2002 సం.లో వి.వి. వినాయక్ దర్శకత్వంలో నిర్మించి సినిమా ‘ఆది’ లో నటించాడు. ఈ చిత్రం 200 రోజుల పాటు ప్రదర్శించబడి గొప్ప విజయాన్ని సాధించింది. తరువాత ఇతను నటించిన సింహాద్రి గొప్ప విజయాన్ని సాధించి జూనియన్ యన్.టి.ఆర్ స్థానాన్ని సుస్థిరం చేసింది. తరువాత ఇతను నటించిన కొన్ని సినిమాలు పరాజయం పొందినా, ఆదుర్స్, బృందావనం సినిమాలు విజయం సాధించాయి. తరువాత వచ్చిన రామయ్యా వస్తావయ్యా, రభస సినిమాలు కూడా విజయాన్ని సాధించాయి.
తరువాత 2015 వచ్చిన టెంపర్ సినిమా జూనియర్ యన్.టి.ఆర్ కు గొప్ప విజయాన్ని సాధించి పెట్టింది. సుకుమార్ దర్శకత్వం వహించిన నాన్నకు ప్రేమతో సినిమాలో విలక్షణం కనబడ్డాడు. ఈ స్టైల్ ను చాలామంది అభిమానులు అనుసరించారు. తరువాత ఇతను నటించిన జనతా గ్యారేజ్ సినిమా ఒకమాదిరిగా ఆడింది. తరువాత వచ్చిన జై లవకుశలో మూడు పాత్రలలో నటించాడు.