కోట శ్రీనివాసరావుకు చిన్నతనం నుండి నాటకాలు అంటే ఆసక్తి ఉండేది. దాదాపు 20 సంవత్సరాల పాటు నాటక రంగంలో ఉన్నాడు. సీనీ పరిశ్రమకు రాక ముందు బ్యాంకులో పనిచేసేవాడు. ఇతని జన్మస్థలం కృష్ణాజిల్లా కంకిపాడు. 1942 జులై 10వ తేదీన జన్మించాడు.
ప్రాణం ఖరీదు నాటకం వేసి అదేపేరుతో తీసిన సినిమాలో తొలిసారిగా నటించాడు. అహ నా పెళ్లంట సినిమాలో కధానాయిక తండ్రిగా పిసినిగొట్టు పాత్రలో నటించి నటుడిగా పేరుతెచ్చుకున్నాడు. ఇతని నటనకు భారతప్రభుత్వం పద్శశ్రీ బిరుదుతో సత్కరించింది.
ఇతను నటించిన కొన్ని సినిమాలు శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్, యముడికి మొగుడు, ఖైదీ నె.786, రెండిళ్ల పూజారి, ఆవిడా మా ఆవిడే, సీతారామయ్య గారి మనుమరాలు, ముఠామేస్త్రీ, హలో బ్రదర్, సమరసింహారెడ్డి, బొమ్మరిల్లు మొదలగునవి.