తెలుగు చిత్రసీమలో నానీ ఓ చిన్న సూపర్ స్టార్. రేడియో జాకీగా, సహాయ దర్శకుడిగా బాపు మరియు శ్రీను వైట్ల గారి దగ్గర పనిచేసిన నానీ తన ప్రతిభతో హీరోగా స్థానం సంపాదించుకున్నాడు. 2008 సం.లో అష్టా చెమ్మ సినిమాతో రంగప్రవేశం చేసాడు. 24 ఫిబ్రవరి, 1984 సంవత్సరంలో కృష్ణా జిల్లాలోని చల్లపల్లిలో జన్మించాడు. తరువాత తల్లిదండ్రులతో పాటు హైదరాబాద్ లో స్థిరపడ్డాడు. ఇతని అసలుపేరు ఘంటా నవీన్ బాబు.
అలా మొదలైంది, పిల్ల జమిందార్, ఈగ వరకు హిట్ సినిమాలే. తరువాత కొన్ని సినిమాలు ఆడకపోయినా ఎవడే శుభ్రహ్మణ్యం సినిమాతో చిత్రసీమలో నిలదొక్కుకున్నాడు. తరువాత నటించిన భలే భలే మగాడివోయ్, జెంటిల్ మెన్, మజ్నూ, నేను లోకల్, నిన్ను కోరి, యం.సి.ఏ వరుస విజయాలు సాధించాయి.2018 లో నాగార్జునతో దేవదాస్ సినిమాలో నటించాడు
జెర్సీ సినిమాలో నటించి తనలోని కొత్త కోణాన్ని చూపించాడు. ఈ సినిమాను నిర్మించాడు. మా టీ.విలో ప్రసారమైన బిగ్ బాస్-2కి వ్యాఖ్యాతగా పనిచేసారు.