తెలుగు చిత్రరంగంలో ఒక విలక్షణమైన నటుడు నాజర్. విలన్ పాత్రలు, తండ్రి పాత్రలు, క్యారెక్టర్ నటుడిగా సుప్రసిద్ధుడు.
ఇతను 1958 మార్చి 5వ తేదీన తమిళనాడులో జన్మించాడు. మాతృదేవోభవ, బాంబే, జీన్స్ చిత్రాలలో నటించి పేరు తెచ్చుకున్నాడు. పోకిరిలో మహేష్ బాబు తండ్రిగా మంచి నటనను కనపర్చాడు. సింహాద్రి, అతడులో నటించాడు.
బాహుబలి 1, బాహుబలి-2 చూసినివారికి నాజర్ తప్పక గుర్తుంటాడు. 2020 సంవత్సరం నాటికి ఇతను చిత్రరంగంలో నటిస్తూనే ఉన్నాడు.