పవన్ కళ్యాణ్ తెలుగు సినిమాల ప్రముఖ నటుడు చిరంజీవి సోదరుడు. 1971 సెప్టెంబర్ రెండున గుంటూరు జిల్లా బాపట్లలో జన్మించాడు.
19196 సం.లో విడుదలైన అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయు సినిమాతో సీనిరంగంలో ప్రవేశించాడు. ఇతను గబ్బర్ సింగ్ నటనకు ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకున్నాడు. తరువాత సమంతతో కలసి నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా తెలుగు చిత్రరంగంలో గొప్ప విజయాన్ని సాధించి అత్యధిక వసూళ్లు రాబట్టింది.
ఇతను స్వతహాగా మార్షల్ ఆర్ట్స్ లో ప్రవీణుడు. చాలా సినిమాలలో ఫైటింగ్ సీన్లలో డూప్ లేకుండా నటించాడు
తరువాత సర్దార్ గబ్బర్ సింగ్, కాటమ రాయుడు సినిమాలలో నటించాడు కానీ ఈ సినిమాలు విజయవంతం కాలేదు. బద్రీ, అన్నవరం, శంకర్ దాదా జిందాబాద్, జల్సా, కొమరం పులి, తీన్ మార్, గోపాల గోపాల, అజ్ఞాతవాసి సినిమాలలో నటించాడు.
ఇతని ముందుగా విశాఖపట్నానికి చెందిన నందిని ని1997లో వివాహమాడాడు కానీ విడాకులు ఇచ్చి , 2009 లో సీని రంగానికి చెందిన రేణూ దేశాయ్ ని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు అకీరా నందన్, ఆద్య. కానీ రేణూ దేశాయ్ తో కూడా పొసగక ఆమెకు కూడా విడాకులు ఇచ్చి 2013లో రష్యా దేశానికి చెందిన Anna Lezhneva ను వివాహమాడాడు. వీరికి ఒక కుమారుడు కూడా. అతని పేరు మార్క్ శంకర్ పవనోవిచ్
2014 మార్చి 14వ తేదీన జనసేన అనే పార్టీని స్థాపించి రాజకీయాలలో ప్రవేశించాడు. 2019లో జరిగిన ఎన్నికలలో తన అభ్యర్ధులను నిలబెట్టాడు కానీ అనూహ్యంగా ఒక్క సీటు మాత్రమే సాధించాడు