ప్రభాస్ సీనీ ప్రస్థానం వర్షం సినిమాతో ప్రారంభమైంది. కానీ ఈ దశాబ్ధంలో బాహుబలి, బాహుబలి-2 చిత్రాలలో నటించి నటుడిగా తనదైన ముద్రవేశాడు. ఈ సినిమాలతో అంతర్జాతీయంగా పేరు సంపాదించుకున్నాడు. ఈ సినిమాను హిందీలో డబ్బింగ్ చేసి విడుదల చేసి బాలీవుడ్ రంగంలో కూడా తిరుగులేని ఇమేజ్ సంపాదించుకున్నాడు. .
ప్రభాస్ 1979 అక్టోబర్ 23వ తేదీన చెన్నైలో పుట్టాడు. ఇతను తెలుగు ప్రముఖ నటుడు కృష్ణంరాజు సోదరుని కుమారుడు. వీరి సొంత గ్రామం పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు. .
బాహుబలి – 2 తరువాత సాహో చిత్రంలో నటించాడు కానీ ఈ సినిమా పెద్దగా విజయం సాధించలేదు. .
కాజల్ అగర్ వాల్ తో డార్లింగ్, మిస్టర్ ఫర్ ఫెక్ట్, దీక్షా సేథ్ తో రెబల్, మిర్చి, శ్రీయా చరణ్ తో ఛత్రపతి, అనుష్కా శెట్టితో బిల్లా, ఇలియానాతో మున్నా, బుజ్జిగాడు మొదలగు సినిమాలలో నటించాడు. ఇతను నటించిన యోగి, రాఘవేంద్ర సినిమాలు పరాజయం పొందాయి. కానీ తెలుగు సీనీ రంగంలో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు.