ప్రకాష్ రాజ్ టాలీవుడ్ (తెలుగు) చిత్రపరిశ్రమలో విలక్షణమైన నటునిగా పేరుపొందాడు. విలన్ పాత్రలు, క్యారెక్టర్ నటునిగా, తండ్రి పాత్రలకు పేరుపొందాడు. ఇతని అసలు పేరు ప్రకాష్ ఆంధోనీ రాజ్ ఇతని జన్మస్థలం బెంగుళూరు. 1965 మార్చి26న పుట్టాడు.
ఇతను నాలుగు సార్లు జాతీయ అవార్డులు అందుకున్నాడు. అంతఃపురంలో ఫ్యాక్షనిస్ట్ గా అద్భుతమైన నటనను చూపాడు. ఖడ్గంలో రవితేజ, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ ముగ్గురు హీరోలు. చూడాలని ఉంది, పోకిరిలో విలన్ విలక్షణమైన నటనకు జీవం పోసాడు. రంగస్థలం, భరత్ అనే నేను సినిమాలలో విలన్ గా నటించాడు. బొమ్మరిల్లు, అకాశమంత, చిరుత, దూకుడు సినిమాలలో తండ్రిపాత్రలు ధరించాడు.
శతమానం భవతి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలలో పరిణితి చెందిన నటుడి తండ్రి పాత్రలో కనపడతాడు. 2020 సంవత్సరం నాటికి ఇతను చిత్రరంగంలో నటిస్తూనే ఉన్నాడు.