రాజేంద్రప్రసాద్ 1956 జులై 19వ తేదీన కృష్ణాజిల్లా గుడివాడ దగ్గరలోని దొండపాడు గ్రామంలో జన్మించాడు. సిరామిక్ ఇంజనీరింగ్ లో డిప్లమో చేసాడు. తన ఊరికి దగ్దరలోని యన్.టి.రామారావు స్వస్థలమైన నిమ్మకూరుకు వెళ్లి వస్తూ ఉండేవాడు. యన్.టి.రామారావు మరియు దర్శకుడు త్రివిక్రమరావు సలహా మేరకు యాక్టింగ్ స్కూలులో చేరి శిక్షణ తీసుకున్నాడు. నందమూరి తారక రామారావు స్ఫూర్తితో సీనీ పరిశ్రమలో ప్రవేశించాడు. 35 సంవత్సరాల సీనీ జివితంలో 200 సినిమాలకు పైగా నటించాడు. నేటికీ నటిస్తూనే ఉన్నాడు
ముఖ్యంగా హాస్యభరితమైన పాత్రలలో నటించి పేరు తెచ్చుకున్నాడు. లేడీస్ టైలర్, అహా నా పెళ్లంట సినిమాలలో ఇతని నటన చూడవలసిందే. తరువాత హాస్య ప్రధానమైన సినిమాలు అప్పుల అప్పారావు, ఏప్రియల్ 1 విడుదల సినిమాలలో నటించాడు. ఆ నలుగురు సినిమాలో విలక్షణమైన పాత్ర పోషించి మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమా తెలుగు సీనీ రంగంలో విజయవంతమైంది. ఎర్రమందారం సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి నంది అవార్డును అందుకున్నాడు.
మేడమ్ సినిమాలో మహిళ పాత్రను అద్భుతంగా పోషించాడు. ఈ సినిమాలో ఇతనికి నంది స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది. 2015 సం.లో మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ కు అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.