రవితేజ తెలుగు సినిమాల మాస్ హీరో. అత్యధిక పారితోషకం అందుకుంటున్న నటుడు కూడా. ఇతని నటనలో కామెడీ మరియు హీరోయిజమ్ కలసి ఉంటాయి. మాస్ మహారాజాగా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. మొదట్లో సినిమాలలో అనేక చిన్న చిన్న వేషాలు వేసాడు కానీ గుర్తింపు రాలేదు. నీకోసం సినిమాలో హీరో వేషం వేసి ప్రశంసలు అందుకున్నాడు. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, రవితేజ ముగ్గురు హీరోలుగా నటించిన ‘ఖడ్గం’ సినిమా విజయవంతమైంది. నీకోసం మరియు ఖడ్గం సినిమాలలో నటనకు నంది స్పెషల్ జ్యూరీ అవార్డులు అందుకున్నాడు.
తరువాత ఇట్లు శ్రావణి శుబ్రహ్మణ్యం, ఇడియట్ సినిమాలలో హీరోగా చేసి సీనీ పరిశ్రమలో స్థిరపడ్డాడు. తరువాత అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, డాన్ శీను, కేక, భద్ర. బలుపు, పవర్, దరువు, మిర్చి, వెంకీ, దుబాయ్ సీను, బెంగాల్ టైగర్ లాంటి విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించాడు. ఇతను నటించిన విక్రమార్క బ్లాక్ బ్లస్టర్ గా నిలిచింది.
2017 నిర్మించిన రాజా ది గ్రేట్ సినిమాలో గుడ్డివాడిగా నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు.
ఇతను 1968 జనవరి 26వ తేదీన ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేటలో జన్మించాడు. ఇతను విజయవాడలోని సిద్ధార్ధ డిగ్రీ కాలేజ్ లో చదువుకున్నాడు.