శర్వానంద్ 1984 మార్చి 6న విజయవాడలోని తాతగారింట్లో జన్మించాడు. కానీ ఇతని విద్యాభ్యాసం హైదరాబాద్ లో జరిగింది. దగ్గుబాటి రాణా, రాంచరణ్ తేజ ఇతని సహవిద్యార్థులు.వీరు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదివారు. స్కూల్ లో డ్రామాలు, డాన్స్ పోటీలలో శర్వానంద్ పేరు ముందుండేది.
సీనీ రంగంలో మొదట్లో చిన్న చిన్న పాత్రలలో నటించాడు. అమ్మ చెప్పింది సినిమాలో మానసికంగా ఎదగని కుర్రాడి పాత్ర పోషించాడు. తరువాత నటించిన ‘గమ్యం’ సినిమాతో హీరోగా మారాడు. ఈ చిత్రం విజయవంతమైనది. తరువాత ప్రస్థానంలో నటించాడు. తరువాత తెలుగు, తమిళ భాషలలో నిర్మించబడ్డ ‘జర్నీ’ చిత్రం కూడ విజయవంతమైనది.
తరువాత రన్ రాజా రన్ లో నటించాడు. 2017 లో అనుపమాపరమేశ్వరన్ తో కలసి నటించిన ‘శతమానం భవతి’ గొప్ప విజయాన్ని సాధించింది. తరువాత ఇతను నటించిన మహానుభావుడు ఓ మోస్తరుగా ఆడింది.