తెలుగు సినిమాలలో హీరోగా పేరు తెచ్చుకున్న మేకా శ్రీకాంత్ కర్ణాటక రాష్ట్రానికి చెందినవాడు. 1968 మార్చి 23వ తేదీన కర్ణాటక కొప్పల్ జిల్లా గంగావతిలో జన్మించాడు. కర్ణాటక విశ్వవిద్యాలయంలో బి.కాం. చదువుకున్నాడు.
సినిమాల మీద ఆసక్తితో ఉషాకిరణ్ మూవీస్ వారు తీసిన ఎన్ కౌంటర్ సినిమాలో మొదటిసారిగా నటించాడు. విలన్ గా తన నటజీవితాన్ని ప్రారంభించి తరువాత హీరోగా మారాడు. తాజ్ మహల్, పెళ్లిసందడి సినిమాలతో మంచి నటుడుగా గుర్తింపు పొంది నటుడిగా స్థిరపడ్డాడు. ఇతను చిరంజీవి అభిమాని చిరంజీవితో కలసి శంకర్ దాదా యం.బి.బి.యస్, శంకర్ దాదా జిందాబాద్ సినిమాలలో నటించాడు. ఖడ్గం సినిమాలో రవితేజ, ప్రకాష్ రాజ్ లతో కలసి నటించి నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆపరేషన్ దుర్యోధనలో కూడా తన నటనా చాతుర్యాన్ని చూపించాడు.
ఇతన తన సహనటి ఊహను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు.
శ్రీకాంత్ నటించిన కొన్ని సినిమాలు ఎగిరే పావురమా, ప్రేయసి రావే, మా నాన్నకు పెళ్ళి, ఊయల, పెళ్లాం ఊరెళితే, సంక్రాంతి, రాధా గోపాళం, మహాత్మ, శ్రీరామరాజ్యం.