తెలుగు సీనిరంగంలో తనికెళ్ల భరణి నటుడు, రచయిత మరియు నాటకాలలో అనుభవం కూడా ఉంది. ముఖ్యంగా హాస్య ప్రధాన పాత్రలు పోషించటంలో నేర్పరి. ఇతను 1956 జులై 14వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలంలో లోని జగన్నాధపురంలో జన్మించాడు.
తనికెళ్ల భరణి సినిమా రంగానికి రాక మునుపు నాటకాలు వ్రాసి అందులో పాత్రలు కూడా పోషించేవాడు. తొలిసారిగా అద్దెకొంప అనే నాటకాన్ని వ్రాసి హైదరాబాద్ రైల్వే కాలేజ్ లో ప్రదర్శింపగా ఈ నాటకానికి మొదటి బహుమతి వచ్చింది. ఇతను రచించిన గోగ్రహణం, కొక్కరోకో గొయ్యి నాటకాలలో విలన్ పాత్రలు పోషించి నాటకాల నటుడిగా పేరుపొందాడు.
తరువాత సీనీ రంగంలో అవకాశాలు రావటంతో సీనీ రచయితగా, నటుడిగా రంగప్రవేశం చేసాడు. లేడీస్ టైలర్, శివ చిత్రాలలో నటించి నటుడిగా స్థిరపడ్డాడు. తరువాత సొగసు చూడతరమా, ఎగిరే పావురమా, మావి చిగురు, పరదేశి చిత్రాలలో మంచి నటన కనబరచాడు. కామెడీ పాత్రలు, విలన్ పాత్రలు, కేరెక్టర్ యాక్టర్ పాత్రలకు పేరుపొందాడు.
ఇతను నటించి కొన్ని సినిమాలు ఇంద్ర, మన్మధుడు, నువ్వునాకు నచ్చావ్,జగదేక వీరుడు అతిలోకసుందరి, యమలీల అప్పుల అప్పారావు, రక్త చరిత్ర.
తనికెళ్ల భరణి ఇప్పటికి (2020) చిత్రసీమలో కొనసాగుతున్నాడు.