విక్టరీ వెంకటేష్ గా పేరుపొందిన దగ్గుబాటి వెంకటేష్, ప్రముఖ చలనచిత్ర నిర్మాత దగ్గుబాటి రామానాయుడు కుమారుడు. ఇతను 1960 డిసెంబర్ 13న చీరాలలోని కారంచేడులో జన్మించాడు. అమెరికాలోని మాంటెర్రీ విశ్వవిద్యాలయంలో యం.బి.ఏ చేసాడు.
వెంకటేష్ ఏడు సార్లు నంది అవార్డులు పొందాడు.70కి పైగా తెలుగు సినిమాలలో నటించాడు ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్యంలో వచ్చిన ‘కలియుగపాండవులు’ లో హీరోగా నటించి తెలుగు తెరకు పరిచయమయ్యాడు.
చంటి, కలిసుందాం రా, సుందరకాండ, బొబ్బలి రాజా, క్షణం క్షణం, ప్రేమించుకుందాం రా, పవిత్రబంధం, సూర్యవంశం, లక్ష్మి,ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, ప్రేమంటే ఇదేరా, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే తులసి మొదలగు విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించాడు. ఇతని సినిమాలు హస్యభరితం మరియు యాక్షన్ రెండూ కలగలసి వుంటాయి.
2014 లో ఇతను నటించి దృశ్యం తెలుగు సినిమా గొప్ప విజయాన్ని సాధించింది. 2019సం.లో నాగచైతన్యతో కలసి వెంకీమామలో నటించాడు.