చలన చిత్ర రంగంలో ప్రవేశించి కేవలం 21 సినిమాలలో మాత్రమే నటించిన అందగత్తె దివ్వభారతి. కేవలం 19 సంవత్సరాల వయసులోని దుర్మరణం పాలైంది. ఈమె మరణం ఇప్పటికీ మిస్టరీనే. ఈమె స్వస్థలం మహారాష్ట్ర. 1974 ఫిబ్రవరి 5వ తేదీన జన్మించింది.
తెలుగు చిత్రసీమలో బొబ్బిలి రాజాలో వెంకటేష్ తో పాటు నటించింది. ఈ సినిమా తెలుగు సీనీరంగంలో హిట్ సినిమాగా పేరుపొందింది.ఈమె సాజిద్ నడియావాలాను 1992 మే 10వ తేదీన కేవలం ముగ్గురు సమక్షంలో రహస్యంగా వివాహం చేసుకుంది.
ఈమె నటించిన కొన్ని తెలుగు చిత్రాలు...బొబ్బిలి రాజా, నా ఇల్లే నా స్వర్గం, రౌడీ అల్లుడు, అసెంబ్లీ రౌడి, ధర్మక్షేత్రం. 1993 ఏప్రియల్ 5వ తేదీన బొంబాయిలో తను నివసించే అపార్ట్ మెంట్ 5వ అంతస్తులోని కిటిలోనుండి జారిపడి మరణించింది.