చలనచిత్ర రంగంలో కొద్దికాలం పాటు వెలిగి రాలిపోయిన తార సౌందర్య. ఈమె అసలు పేరు సౌమ్య. తెలుగు, తమిళం, మళయాళం, కన్నడ సినిమాలలో నటించింది.
అమ్మోరు చిత్రంలో చిన్న పాత్రలో నటించింది. ఈ సినిమాలో నటించేపుడు ఈమె యం.బి.బి.యస్ మొదటి సంవత్సరం చదువుకుంటుంది. తరువాత వరసగా సినిమాలలో అవకాశాలు రావటంతో చదువు ఆపివేసింది. కన్నడంలో ద్వీప అనే సినిమాను నిర్మించింది. ఈ చిత్రానికి స్వర్ణకమలం బహుమతి లభించింది. కర్ణాటక ప్రభుత్వం నుండి ఉత్తమ నటి, ఉత్తమ చిత్రం, ఉత్తమ ఛాయాగ్రహనికి బహుమతులు లభించాయి.
సౌందర్య తెలుగు హీరో వెంకటేష్ తో నటించిన రాజా, జయం మనదేరా, పెళ్ళి చేసుకుందాం, పవిత్రబంధం, ఇంట్లొ ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలు వియజవంతంగా ఆడాయి. తెలుగులో వచ్చిన అంతఃపురం సినిమాలో విభిన్నమైన పాత్రలో నటించింది. పన్నెండు సంవత్సరాల నటజీవితంలో ఆరుసార్లు ఫిలింఫేర్ అవార్డులు దక్కించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం నుండి అమ్మోరు, పవిత్రబంధం, అంతఃపురం చిత్రాలకు నంది అవార్డులు అందుకుంది.
సౌందర్య తన బాల్యమిత్రుడు జి.యస్. రఘును పెళ్లి చేసుకుంది. ఈమె సమాజానికి చాలా మేలు చేసింది. అమర సౌందర్య విద్యాలయ అనే విద్యాలయాన్ని స్థాపించింది. సౌందర్య చనిపోయిన తరువాత కూడా ఈ విద్యాలయాన్ని సౌందర్య కుటుంబం నిర్వహిస్తుంది.
తరువాత ఈమె బి.జె.పి పార్టీలో చేరింది. బి.జె.పి తరపున ప్రచారం చేయ్యటానికి ప్రత్యేక విమానంలో బయలు దేరి దురదృష్ణ వశాత్తు 2014 ఏప్రియల్ 17వ తేదీన విమానం ప్రమాదవశాత్తు కుప్పకూలి పోవటంతో ఈ ప్రమాదంలో సోదరునితో సహా మరణించారు.
సౌందర్య నటించిన కొన్ని చిత్రాలు అల్లరి ప్రేమికుడు, రాజేంద్రుడు గజేంద్రుడు, అన్నయ్య, పెదరాయిడు, జయం మనదేరా, దేవీపుత్రుడు, అరుణాచలం, మా ఆయన బంగారం