తెలుగు సీనీరంగంలో విలన్ గా ప్రవేశించి తరువాత కేరక్టర్ పాత్రలు, తరువాత హీరోగా మారిన నటుడు శ్రీహరి. ఇతను 1964 ఆగస్టు 16వ తేదీన హైదరాబాద్ లో జన్మించాడు. ఇతని తాతగారి కుటుంబం శ్రీకాకుళం జిల్లా నుండి కృష్ణాజిల్లా యలమర్రు గ్రామానికి వలస వచ్చింది. ఏడవ తరగతి దాకా యలమర్రులోనే చదువుకున్నాడు. తరువాత వీరి కుటుంబం హైదరాబాద్ కు మకాం మార్చారు.
శ్రీహరి చక్కని శరీర సౌష్టవం కలవాడు. సినిమాలలోకి రాకముందు దేహధారుడ్య పోటీలలో పాల్గోని మిస్టర్ హైదరాబాద్ గా ఏడుసార్లు అవార్డును అందుకున్నాడు. 1986లో స్టంట్ మాస్టర్ గా సీనీ ప్రస్తావనాన్ని ప్రారంభించాడు. దర్మక్షేత్రం సినిమాలో తొలిసారిగా నటించాడు. తాజ్ మహల్ సినిమాలో విలన్ గా నటించాడు. గణపతి, అయోధ్య రామయ్య, శ్రీశైలం, భద్రాచలం, హనుమంతు చిత్రాలలో హీరోగా నటించాడు.
మగధీర సినిమాలో షేర్ ఖాన్ పాత్ర ధరించి విమర్శకుల ప్రశంశలు అందుకున్నాడు. తరువాత నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బృందావనం, తుఫాన్ చిత్రాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. సినిమాలలో తెలంగాణా యాసతో మాట్లాడేవాడు శ్రీహరి. ఇతను తెలుగు నటి డిస్కోశాంతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కానీ పుట్టిన నాలుగు నెలలకే కుమార్తె అక్షర మరణించింది. అక్షర పేరుమీద మేడ్చల్ పరిధిలోని నాలుగు గ్రామాలను దత్తత తీసుకుని గ్రామాలకు మినరల్ వాటర్ సౌకర్యం కల్పించాడు. మౌలిక సదుపాయాలకోసం కృషి చేసాడు.
షూటింగ్ నిమిత్తం ముంబై వెళ్లిన శ్రీహరి అనారోగ్యానికి గురవ్వటంతో బొంబాయి లీలావతి హాస్పటల్ లో చేర్చించారు. కానీ 2013 అక్టోబర్ 9వ తేదీన కన్నుముసాడు. ఇతని మరణానికి కారణం కాలేయ సంభందిత వ్యాది అని తేలింది.
ఇతను మంచి వ్యక్తిత్వం కల నటుడు. తన దగ్గరికి సాయం కోరి వచ్చిన వారికి లేదనకుండా సాయం చేసేవాడంటారు.