తెలుగు సీనీరంగంలో కేవలం కొద్ది సినిమాలలో నటించి మంచి నటుడిగా పేరుతెచ్చుకుని అర్ధాంతరంగా ఆత్మహత్య చేసుకుని మరణించిన నటుడు ఉదయ్ కిరణ్. ఇతను 1980 జూన్ 26వ తేదీన హైదరాబాద్ లో జన్మించాడు. బి.కాం. డిగ్రీ చదువుకున్నాడు.
ఇతను మొదట నటించిన సినిమా చిత్రం, తరువాత నటించిన నువ్వు నేను, మనసంతా నువ్వే సినిమాలు వరుసగా హిట్ అవ్వటంతో హాట్రిక్ హీరోగా పేరుతెచ్చుకున్నాడు. నువ్వు నేను సినిమాకు ఫిలింఫేర్ అవార్డు వచ్చింది. తరువాత కలుసుకోవాలని, శ్రీరాం సినిమాలలో నటించాడు.
ఇతనికి చిరంజీవీ కూతురు సుష్మితతో నిశ్చితార్ధం జరిగినా వివాహం మాత్రం జరగలేదు. తరువాత విషితను 2012 లో వివాహం చేసుకుని హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో మకాం పెట్టాడు. తరువాత సినిమాలలో అవకాశాలు రాకపోవటంతో డిప్రెషన్ కు గురై తన ఇంట్లోనే 2014 జనవరి 14వ తేదీన ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.