header

About Angola / అంగోలా

About Angola / అంగోలా

అంగోలా రాజధాని లువాండా. దీనిని ‘ప్యారిస్ ఆఫ్ ఆఫ్రికా’ అని పిలుస్తుంటారు. అధికార భాష పోర్చుగీస్ కరెన్సీ క్వాంజా
ప్రధాన భాష పోర్చుగీస్ అయినా బంటు, కికోంగో మొదలైన ఆఫ్రికన్ భాషలు కూడా మాట్లాడతారు. అభివృద్ధిపథంలో దూసుకుపోవడానికి అవసరమైన వనరులు ఉన్నప్పటికీ అశాంతి కారణంగా అభివృద్ధికి దూరంలో ఉండాల్సి వచ్చింది అంగోలా.
ఆఫ్రికా ఖండంలో ఉన్న ఈ దేశం సుదీర్ఘకాలం పాటు పోర్చుగీసువారి వలస దేశంగా ఉంది. తమ ప్రయోజనాల కోసం ఈ భూభాగాన్ని వాడుకోవడం తప్ప అభివృద్ధిపై దృష్టి పెట్టలేదు పోర్చు గీసు పాలకులు. పదిహేడు, పద్దెనిమిది శతాబ్దాల్లో అంగోలా ... పోర్చుగీసు పాలకులకు ‘బానిసలు విరివిగా దొరికే ప్రాంతం’గానే ఉండిపోయింది. ఇక్కడి నుంచి బానిసలను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేవారు. తరువాత కాలంలో ఈ బానిస వ్యాపారం రద్దయిపోయి... తిరుగుబాటు ఉద్యమాలు వెల్లువెత్తాయి. గెరిల్లా యుద్ధం మొదలైంది.
పోర్చుగీసు రాజ్యంపై సాయుధపోరాటానికి దిగిన వివిధ దళాల మధ్య ఐక్యత లేకపోగా ఒకరిపై ఒకరు దాడులకు దిగేవాళ్లు. ఈ అనైక్యత తరువాతి కాలంలో దేశంలో సామాజిక అశాంతికి దారి తీసింది.
పోర్చుగల్ నుంచి 1975లో స్వాతంత్య్రం పొందింది అంగోలా. స్వాతంత్య్రం వచ్చిన మాటేగానీ శాంతి లేదు. దేశంలో అంతర్యుద్ధం తీవ్రరూపం దాల్చింది.
రాజ్యాధికారం కోసం ‘పీపుల్స్ మూవ్ మెంట్ ఫర్ ది లిబరేషన్ ఆఫ్ అంగోలా’, ‘నేషనల్ యూనియన్ ఫర్ ది టోటల్ ఇండిపెండెన్స్ ఆఫ్ అంగోలా’ల మధ్య పోరు జరిగింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిందనే సంతోషాన్ని ఈ పోరు మాయం చేసింది. దేశం అతలా కుతలం అయింది. దేశంలో శాంతిని నెలకొల్ప డానికి 1991లో కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ అది 1992లో విఫలమైంది. తిరిగి 1994లో కాల్పల విరమణ ఒప్పందం కుదిరింది.
1998లో ఈ ఒప్పదం విఫలమైంది. చాలాకాలం పాటు కొనసాగిన అంతర్యుద్ధం 2002లో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంతో ముగిసింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం భారీగా జరిగింది. అయినప్ప టికీవెనక్కి తగ్గకుండా యుద్ధశిథిలాల్లో నుంచి లేచి తనను తాను పునర్నిర్మించుకుంటూ కొత్త అడుగులు వేసింది. 2010లో దేశంలో కొత్త రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. పాలనాపరంగా చెప్పాలంటే... అంగోలా 8 ప్రావిన్సులుగా, 163 మున్సిపాలిటీలుగా విభజితమైంది.
చాలాకాలం పాటు వలస దేశంగా ఉండడం వల్ల అంగోలా కళాసంస్కృతులపై పోర్చుగీసు ప్రభావం కనిపిస్తుంది.
అంగోలా, నమీబియా సరిహద్దుల్లో ఉన్న రౌకెనా జలపాతం ప్రకృతి అందాలకు ప్రతిబింబం. విస్తారమైన ఖనిజ సంపద, పెట్రోలియం నిల్వలు ఉండటంతో తన ఆర్థికవ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి వేగంగా అడుగులు వేస్తోంది. ఒకప్పుడు అంగోలా అంటే అశాంతి. ఇప్పుడు మాత్రం అభివృద్ధి!
అంగోలాలో ఆదరణ ఉన్న క్రీడ బాస్కెట్బాల్. అంగోలాలో సుంబే సంగీతం ప్రసిద్ధి. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో ‘సుంబే మ్యూజిక్ ఫెస్టివల్’ ఘనంగా జరుగుతుంది.
చమురు, వజ్రాలు ప్రధాన ఆర్థిక వనరులు. చైనాకు ఎగుమతి అయ్యే చమురులో అత్యధిక భాగం అంగోలా నుంచే ఎగుమతి అవుతుంది.
అంగోలాలో అతి ఎత్తయిన పర్వతం... సెర్రా మౌంటెన్. దీని ఎత్తు 2,306 మీటర్లు.
అంగోలాలో మరణాల రేటు ఎక్కువ.‘డ్రెడ్లాక్ హెయిర్ స్టయిల్’ ఇక్కడే పుట్టింది. అంగోలా అందాలరాశి లైలా లోపెజ్ 2011లో ‘మిస్ యూనివర్స్’ కిరీటాన్ని గెలుచుకుంది.

About Angola This country is located in South Western Africa. Angola's capital is Luanda. It is also called as 'Paris of Africa'. Luanda is a large port center and Commercial Center. Country’s Official language is Portuguese Currency kwanza. Angola is a Christian country
The main language is Portuguese, but also people will spoke African languages such as Bantu, Kikongo. Angola has plenty of natural recourses to develop but not flourished on development due to internal conflicts and social unrest.
This country is ruled by Portuguese for a long time. Portugal's govt rulers did not focus on development rather than use this land for their purposes. In the seventeenth, eighteenth centuries Angola remained the slave available country for the Portuguese rulers. Slaves were exported to other areas from here. Later the slave trade was canceled and the rebellious movements started. The guerrilla war also began.
There was no unity among the different forces that resided in the Portuguese kingdom, and they were fights with one another. This disunity later led to social unrest in the country.
Angola achieved independence from Portugal in the year 1975. Due to intensification of the civil war in the country there is no peace in the country.
'People's Movement for the Liberation of Angola' and 'National Union for the Total Independence of Angola' organizations are struggled together for Kingdom power. This conflict has ruined the happiness of the country's independence. Despite the ceasefire agreement in 1991, it failed in 1992 to establish peace in the country. Back in 1994, the Cullen Retirement Treaty was signed. But this agreement was also failed in 1998. The long-running Civil War ended with a 2002 ceasefire agreement. But the damage that has already occurred is huge.
In 2010, a new constitution came into force in the country. In administrative terms, Angola is divided into 8 provinces and 163 municipalities.
The Rowena Falls is located on the border between Angola and Namibia and reflects the beauty of nature. With the presence of vast mineral wealth and petroleum reserves, the rapid steps are being taken to strengthen countries economy. Angola is once a disaster. But now it's developing!
The popular sport is basketball in Angola. Sumbe music is famous in Angola. The 'Sumbe Music Festival' is held every year in the month of September.
Oil and diamonds are major financial resources. Most of the oil exported to China.
The highest mountain in Angola ... Serra Mountain. Its height is 2,306 meters.
In Angola there is a higher mortality rate. The 'reddock hair style' originated in this country. Beautiful lady Laura Lopez belongs to Angola has won the ‘Miss Universe’ crown in the year 2011.