బెనిన్... ఆఫ్రికా ఖండంలోని దేశం. రాజధాని పోర్టో నోవొ. జనాభా 1,08,79,829 ఈ దేశ విస్తీర్ణం 1,14,763 చదరపు కిలోమీటర్లు. వీరి భాష ఫ్రెంచ్. కరెన్సీ పశ్చిమ ఆఫ్రికన్ సీఎఫ్‌ఏ ఫ్రాంక్
ప్రజలు ఫ్రెంచ్ తర్వాత ఫాన్, యోరుబా భాషల్ని ఎక్కువగా మాట్లాడుతుంటారు. ఈ దేశానికి పశ్చిమాన టోగో, తూర్పున నైజీరియా, ఉత్తరాన బుర్కినాఫాసో, నైజర్ దేశాలు సరిహద్దులు. దక్షిణాన అట్లాంటిక్ మహా సముద్ర భాగమైన గినియా అఖాతం ఉంది.
ఈ దేశ జెండాలోని ఎరుపు రంగు ధైర్యానికి, పసుపు రంగు సంపదకు, ఆకుపచ్చ ఆశకి గుర్తులు.
రాజధాని పోర్టోనోవొలో 17వ శతాబ్దం మొదట్లో బానిసల వ్యాపారం ఎక్కువగా జరిగేది. అందుకే ఈ తీరాన్ని బానిసల తీరంగా పిలిచేవారు. ఇక్కడి నుంచి బానిసల్ని నౌకల్లో వేరే ప్రాంతాలకు రవాణా చేయడం ద్వారా కోట్ల రూపాయల వ్యాపారం జరిగేది.
బెనిన్ 1960 ఆగస్టు ఒకటిన ఫ్రాన్స్ నుంచి స్వాతంత్య్రం పొందింది. 1975 నవంబరు నుంచి ఈ దేశాన్ని బెనిన్ అని పిలువబడుతుంది. 1990లో నియంతృత్వ పాలన నుంచి బహుళ పార్టీలున్న ప్రజాస్వామ్య దేశంగా మారింది. ఈ దేశంలోఎడమ చేతితో తినడం కానీ, ఎడమ చేతితో ఇతరులకు ఏదైనా ఇవ్వడం కానీ చేయకూడదు. అలా చేస్తే అమర్యాదగా భావిస్తారు.
ఈ దేశానికే దహోమి అని మరో పేరు. 17వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు ఇది దహోమి రాజ్యంగా ఉండేది. ఈ దేశప్రజలప్రధాన వృత్తి వ్యవసాయం. ఈ దేశ జాతీయ క్రీడ సాకర్.
దేశంలో 31 శాతం భూభాగాన్ని వ్యవసాయానికి ఉపయోగిస్తారు. 40 శాతం అడవులతో నిండి ఉంటుంది. ఇక్కడ నేరాలు తక్కువే. కానీ దొంగతనాలు ఎక్కువ. అందుకే ప్రతి ఇంటి యజమానీ రాత్రి వేళల్లో వాచ్‌మేన్‌ను తప్పక పెట్టుకుంటారు.
ఒకరితో మాట్లాడే ముందూ, వీడ్కోలు చెప్పిన తరువాత కరచాలనం చేయడం వీరి సంప్రదాయం. ప్రజలు ఫొటోలు తీసుకోవడానికి ఇష్టపడరు. అవి దుర్వినియోగం అవుతాయని భావిస్తారు.
రాజధాని పోర్టోనోవొని అడ్జటేజ్, హగ్‌బోనౌ అని కూడా పిలుస్తారు. దేశం మొత్తంలో పెద్ద నగరం కొటోనౌ. ప్రపంచవ్యాప్తంగా ఈ దేశం చెక్కతో చెక్కిన ముసుగులకు ప్రసిద్ధి.
Benin is in Africa. Capital is Porto-Novo. Territory of this country is 1,14,763 square kilometers. Official language is French. Currency African CFA Franc. After French language people will speak Fan and Yoruba.
This country shares boundaries in the west with Togo, in the east Nigeria, in the north Burkina Faso and Niger. It is bordered in the south by Guinea bay
The red color of the flag of this country reflects braveness, yellow color for wealth and green color for hope.
In Porto-Novo, in the early of 17th century slave trade is running largely, so, this area is calls as ‘Slave Coast’
.
Benin attained independent in the year 1960 from France. In 1990, it became a democratic country with multiple parties from dictatorship. This country was known as Dahomey earlier and it was named Benin on November 30, 1975.
In this country crime rate is low . But theft is a problem and many wealthier homeowners generally appoints a night watchman.
AIDS is a major problem in the country and it is straining the health care system of the country. In this country eating with left hand and offering something with left hand is considered disrespectful.
The main occupation of the people of this country is agriculture. Soccer is the country's national sport. 40% of the land is covered with forest.
People are not interested to take photographs while they are misused. Prior and after speaking with some these people shake hands. This is their tradition.
Cotton is the main export item and country is depended on agriculture and regional trade.
Cotonou is the largest city and Seaport, International airport is here.
This country is famous worldwide for wood carved masks.