బోట్స్ వానా ఆఫ్రిరా ఖండం దక్షిణ భాగంలో తూర్పున ఉన్న ఒక స్వతంత్ర దేశం. ఈ దేశానికి దక్షిణాన దక్షిణాఫ్రికా, పశ్చిమాన సమీబియా, ఉత్తరా జింబాబ్యే దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి. 1966 సంవత్సరానికి ముందు ఈ దేశం పేరు బెచువానీ ల్యాండ్.
ఈ దేశం అవినీతి రహితమైనది మరియు మానవ హక్కులు పాటించే దేశం కూడా. ఈ దేశ విస్తీర్ణం 581,730 sq km.వీరి అధికార భాష ఇంగ్లీష్. మరియు సెట్స్ వానా భాష కూడా మాట్లాడుతారు. ఈ దేశంలో క్రిస్టియన్లు ఎక్కువ తరువాత స్థానిక మతాలను అవలంభించే వారున్నారు. వీరి కరెన్సీ పేరు పులా.
ఈ దేశ విస్తీర్ణం 5,81,730 చ.కి.మీ. దేశ రాజధాని గాబోరెనే. వీరి అధికార భాష ఇంగ్లీష్. బోట్స్ వానా ప్రజలు ఆదిమ జాతులవారు. త్య్యానా తెగవారు 75 శాతం మంది, షోనా తెగవారు 12 శాతం మంది, శాన్ తెగవారు 4 శాతం, ఖోయిఖోయిన తెగవారు 3 శాతం మంది కలరు.
కలహారీ ఎడారి ఈ దేశం అంతా వ్యాపించి ఉంది. ఉత్తర దిశలో అంగోలా దేశం నుండి ఓకోవాన్గో నది న్గామి ల్యాండ్ ప్రాంతంలోనికి ప్రవహిస్తుంది. నిద్రా వ్యాధిని కలుగ చేసే ట్సీట్సీ ఈగ బెడదకు భయపడి ఈ ప్రాంతంలో ఎవరూ నివసించరు.
బొబ్బర్లు, మొక్కజొన్న, చిక్కుళ్ళు, ప్రత్తి, జొన్న, వేరుశెనగ, చిరు ధాన్యాలు, పొగాకు ప్రధానమైన పంటలు.. గొడ్డుమాంసం కోసం పశువులను పెంచుతారు. మేకలను కూడా పెంచుతారు.
రాగి, ఆస్ బెస్టాస్, వజ్రాలు, నికెల్, నేలబొగ్గు, మాంగనీస్ ఖనిజ నిక్షేపాలు లభిస్తాయి. పరిశ్రమలు తక్కువ. ప్రపంచంలోనే వజ్రాలు ఎక్కువగా లభించే దేశం బోట్స్ వానా. వజ్రాలను త్రవ్వి ఎగుమతి చేసి విదేశీ ద్రవ్యాన్ని ఆర్జిస్తున్నారు.