బురుండీ తూర్పు ఆఫ్రికాలోని ఒక చిన్న స్వతంత్ర దేశం. ఈ దేశ విస్తీర్ణం 27,834 చ.కి.మీ. రాజధాని బుజుబూరా. వీరి అధికార భాషలు రుండీ, ఫ్రెంచ్. వీరి కరెన్సీ బురుండియన్ ఫ్రాంక్ లు. ప్రజలలో రుండీ తెగ వారు 97 శాతం మంది ఉన్నారు. హూట్టూ, టూట్సీ త్వాపిగ్మీ ఇతరజాతులవారు నివసిస్తున్నారు. ప్రజలు క్రైస్తవ మతస్తులు. కొద్దిమంది ఆదిమ జాతుల వారు ఉన్నారు. ప్రపంచంలోని బీద దేశాలలో బురుండీ ఒకటి
ఈ దేశానికి నైరుతి దిశగా టాంగానీక్వా సరస్సు, ఈ శాన్యంగా కోహాహా సరస్సు, రువేరు సరస్సు, రుసిజీ నది, రువేరున్జీ నది, రూవూబూ నదులు ఉన్నాయి. ఇవే ఈ దేశానికి ప్రదాన జనవనరులు.
అరటి, చిరుగడం, కర్రపెండలం, కందమూలాలు, వేరుశెనగ చిరుధాన్యాలు, పామ్ గింజలు, ప్రత్తి ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులు. పశుపోషణ, కోళ్లపెంపకం, గొర్రెలు, మేకల పెంపకం ప్రజలకు జీవనాధారాలు. కయొలిన్ మన్ను, సున్నం, బంగారం ప్రదాన ఖనిజాలు ఇక్కద దొరకుతాయి. మద్యపానీయాలు, సిగరెట్లు, పాదరక్షలు ప్రధాన పరిశ్రమలు.