header

Central African Republic… సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ....్

Central African Republic… సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ....

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ చుట్టూ భూభాగాలే కలదేశం. ఈ దేశ రాజధాని Bangui. దేశ వైశాల్యం 6,22,984 చ.కి.మీ. వీరి అధికార భాషలు ఫ్రెంచ్ మరియు సాంఘో. వీరి కరెన్సీ CFA Franc. ఈ దేశం ఫ్రాన్స్ నుండి 13 ఆగస్ట్ 1960 సంవత్సరంలో స్వాతంత్ర్యం పొందింది. కానీ అప్పటినుండి దేశంలో స్థిరత్యం లేదు. జనాభా పరంగా అభివృద్ది చెందని దేశం.
ఈ దేశానికి చుట్టూ చాద్, సూడాన్, కాంగో, కామరూన్ దేశాలు కలవు. ఈ దేశం క్రైస్తవ మతానికి చెందినది.
వజ్రాలు, బంగారం, యురేనియం, కోబాల్డ్, కలప మరియు ఆయిల్ ఖనిజ నిక్షేపాలు పుష్కలంగా లభిస్తాయి. కానీ ఈ దేశ అభివృద్ధి చెందలేదు. ఆరోగ్యపరంగా కూడా వెనుకబడిన దేశం.
ప్రత్తి, కాఫీ గింజలు, పొగాకు, చేమదుంపలు, చిరుధాన్యాలు, మొక్కజొన్న, అరటి వ్యవసాయ ఉత్పత్తులు. వ్యవసాయ యోగ్యమైన భూములు చాలా కలవు.