చాద్.. మధ్య ఆఫ్రికాలో ఉంది. ఈ దేశానికి సముద్ర తీరం లేదు. అన్ని పక్కలా ఇతర దేశాల భూభాగమే ఉంటుంది. ఉత్తరాన లిబియా, తూర్పున సూడాన్, దక్షిణాన సెంట్రల్ ఆఫ్రికా రిపబ్లిక్ ఉన్నాయి. అలాగే కామెరూన్, నైజర్ దేశాలూ ఈ దేశానికి సరిహద్దులు.
చాద్ రాజధాని అన్‌జమేనా. జనాభా 1,36,70,084. ఈ దేశ విస్తీర్ణం 12,84,000 చదరపు కిలోమీటర్లు. భాషలు ఫ్రెంచ్, అరబిక్ ఇవి కాక ఈ దేశంలో 100 భాషలు మాట్లాడతారు. ఫ్రెంచ్ ఎక్కువ మాట్లాడే దేశాల్లో దీని స్థానం 21.
కరెన్సీ మధ్య ఆఫ్రికా ఫ్రాంక్
ఇక్కడి చాద్ అనే సరస్సు ఆఫ్రికాలోనే రెండో అతి పెద్దది. ప్రపంచంలో పదిహేడో అతి పెద్ద సరస్సు ఇది. దీని పేరు మీదుగానే ఈ దేశానికీ పేరొచ్చింది. ఇక్కడ పెళ్లి చేసుకునే ముందు అబ్బాయి, అమ్మాయి వాళ్ల పొలంలో మూడు సంవత్సరాలు పని చేయాలి. అత్తింటివారి కోసం చిన్న గుడిసె, ఈత చాపలు తయారుచేయాలి.
పిల్లలు పుట్టిన వెంటనే తల్లి వేరే ప్రదేశానికి వెళ్లకూడదు. అలా వెళితే దుష్టశక్తుల ప్రభావం పడుతుందని నమ్ముతారు.
ఇక్కడ సహజవనరులు ఎక్కువ. పెట్రోలియం, యురేనియం, బంగారం, సున్నపురాయి అధికంగా దొరుకుతాయి. ఈ దేశ జాతీయ మ్యూజియంలో 9వ శతాబ్దానికి చెందిన కళారూపాల్ని చూడొచ్చు.
ఈ దేశ జెండాలో నీలం రంగు ఆకాశానికీ, నమ్మకానికీ సూచిక. పసుపు రంగు సూర్యుడికి చిహ్నం. ఎరుపు అగ్నికీ, ఐకమత్యానికీ గుర్తు.
చాద్ లో క్రీస్తు పూర్వం 500 సంవత్సరం నుంచి ప్రజలు నివసిస్తున్నారు. క్రీస్తుశకం ఎనిమిదవ శతాబ్దంలో బెర్బర్లు ఈ ప్రాంతానికి వలస వచ్చారు. ఈ దేశం ఫ్రెంచ్ కమ్యూనిటీలో స్వయం ప్రతిపత్తి గల రిపబ్లిక్‌గా 1946లో అవతరించింది. 1960లో ఫ్రాన్స్ నుంచి పూర్తి స్వాతంత్య్రం పొందింది.
చాద్ లోని జకోమా నేషనల్ పార్కులో 226 జాతుల పక్షుల్ని గుర్తించడం జరిగింది.
About Chad…
Chad is in Central Africa. There is no coastal area to the Chad. It is bounded by land on all sides. To the North side Libya, to the south Central African Republic, to the east Sudan. On the West bounded by Cameroon and Niger countries are also shared boundaries to this country. Capital of Chad is N'Djamena.
Territory of this country is 12,84,000 square kilometers. French and Arabic languages are official languages. Apart from this 100 languages will be spoken by people. Currency is Franc. Chad is the 5th largest country in this continent. Major people in Chad belong to Christian and Muslim religion.
Lake Chad is second biggest lake in Africa. And 17th place in the world. Chad name is given by this lake.. Before marrying bridegroom must work for three years in the fields of bride and bridegroom should be build a small hut.
In Chad natural resources are high. Petrol, Uranium, Gold, Limestone will be available in large scale.
9th century Art works can be seen in the National Museum of this country. Blue color of this country’s flag indicates sky and trust. Red color indicate fire and unity. Since 500 BC people are living in this country.
Berbers immigrated to this region in the eight century BC. Chad became self-governed republic in the year 1946 and achieved independence in the year 1960 from France.
In the Zakouma National Park of chad 226 bird species are recognized.
Most of the people are depended by Agriculture. Cotton crop is grown in south of this country.