header

About …..Comoros…..కొమరోజ్

About …..Comoros…..కొమరోజ్

కొమరోజ్... హిందూ మహాసముద్రంలో ఉన్న సార్వభౌమ ద్వీప దేశం. ఈ దేశానికి వాయవ్యంలో టాంజానియా, తూర్పున గ్లోరియోస్ ద్వీపాలు, నైరుతీలో మడగాస్కర్, పశ్చిమాన మొజాంబిక్ ఉంటాయి. చిన్నాపెద్దా అగ్నిపర్వతాలతో నిండి ఉంటుందీ దేశం. ఈ ద్వీప దేశం చాలా చిన్నది. మన దేశంలోనే చిన్నదైన గోవా రాష్ట్రం కన్నా చిన్నది. ఈ దేశ రాజధాని మొరోని. వీరి భాషలు కోమోరియన్, అరబ్ మరియి ఫ్రెంచ్. వీరి కరెన్సీ కొమోరియన్ ఫ్రాంక్స్. కొమరోజ్ ముస్లిం దేశం. ‘కొమరోజ్’ అరబిక్ పదం నుంచి వచ్చింది. దీనర్థం చంద్రుడు.
ఈ దీవుల్లో మొదటిసారిగా అడుగుపెట్టింది పాలీనీషియన్లు, మెలనీషియన్లు, మలయాలు, ఇండోనేషియన్లు. వీరంతా క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దానికి ముందే ఇక్కడికొచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. చిన్నచిన్న దీవులతో ఉన్న ఈ ద్వీప దేశంలో గ్రాండీ కొమరీ, మొహెలీ, అన్జోన్, మయొట్టీ అనే నాలుగు ముఖ్యమైన దీవులుంటాయి. వీటిల్లో మయొట్టీ ద్వీపం ఇంకా ఫ్రాన్స్ అధీనంలోనే ఉంది.
ఈ దేశం 1975 జులైలో ఫ్రాన్స్ నుంచి స్వాతంత్య్రం పొందింది.
సువాసన నూనెల్లో ఉపయోగించే ‘ఇలాంగ్ ఇలాంగ్’ అనే నూనెల్ని ప్రపంచం మొత్తంలో ఎక్కువగా ఉత్పత్తి చేస్తుందీ దేశం. ఈ ద్వీప వాతావరణంలో మాత్రమే నివసించే ప్రత్యేకమైన 20 పక్షి జాతులు ఇక్కడుంటాయి. మాంగూస్ లెమర్లు మడగాస్కర్తో పాటు ఈ దేశంలో మాత్రమే కనిపిస్తాయి.
బియ్యం, పెట్రోలియం ఉత్పత్తులు, సిమెంట్, ఇతర ఆహార పదార్థాల్ని ఈ దేశం ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది. ఇక్కడ ఎక్కువగా లవంగాలు, కొబ్బరి, అరటి పండ్లు, ఇతర సుగంధ ద్రవ్యాల్ని పండిస్తారు.

About Comoros… Comoros is a sovereign country in the Indian Ocean. This country is bounded by Tanzania in the North West. In the East glorious islands, in the south west Madagascar, and in the west Mozambique.
This island is very small and smaller than Goa in India. Maroni is the capital of this country. Comorian, Arab and French are the National Languages. Currency is Francs. Comoros is a Muslim country. Comoros word comes from Arabic language and it means Moon.
Polynesians are entered first time in this island. Prior to 6 century of BC Melanesians, Malayas, Indonesians are settled here permanently. islands of the Comorian archipelago have four important islands named Anjoun, Grandi Comori, Mayotti. Mayotti is still governing by French.
This country is gained independence in the year 1975 from France. This country produces Ylang Oil in large scale over the world , which used to produce perfumes. Lemurs and twenty brid species are peculiar to this island and Madagascar.
This country imports Petroleum products, Rice and other foodstuffs.
Cloves, Coconut, Bananas, and aromatic plants like frangipani, jasmine and lemon grass will be grown in this country.