header

Djibouti….జిబౌటి

Djibouti….జిబౌటి

హార్న్ ఆఫ్ ఆఫ్రికా దేశాలలో ఒకటి... జిబౌటి. ఈ దేశ రాజధాని జిబౌటి నగరం. ఫ్రెంచ్, అరబిక్ వీరి భాషలు. మూడింట రెండు వంతుల మంది దేశరాజధానిలోనే నివసిస్తారు. ఫ్రెంచ్, అరబ్బీలతో పాటు సోమాలి, అఫర్లను మాట్లాడతారు. వీరి కరెన్సీ Djiboutian franc. జిబౌటి ముస్లిం దేశం. దేశంలో అక్షరాస్యత 68 శాతం.
ఈ దేశానికి ఉత్తరంలో ఎరిట్రియా, దక్షిణంలో ఇథియోపియా, ఆగ్నేయంలో సోమాలియా దేశాలు సరిహద్దులు. సుదీర్ఘకాలం పాటు ఫ్రెంచ్ పాలనలో ఉంది జిబౌటి. 1966 ఆగస్ట్లో ఫ్రెంచ్ అధ్యక్షుడు చార్లెస్ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు స్వాతంత్య్రం కావాలంటూ నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాయి. ‘ఫ్రెంచ్ అధీనంలో ఉంటారా? స్వాతంత్య్రం కావాలా?’ అనే అంశంపై ఫ్రెంచ్ గవర్నర్ జనరల్ లూయిస్ సాగెట్ రెఫరెండం నిర్వహించారు.
60 శాతం మంది ఫ్రెంచ్ పాలనలోనే ఉండడానికి మొగ్గు చూపారు. కానీ నిరసనలు ఆగలేదు. స్వాతంత్య్రకాంక్ష ఏదో ఒక ఉద్యమ రూపంలో వ్యక్తమవుతూనే ఉండేది. చివరకు 1977లో ఫ్రెంచ్ పాలన నుంచి స్వాతంత్య్రం పొందింది జిబౌటి. ఒకవైపు స్వాతంత్య్ర సంబరాలు, దేశంలోని నాన్ సోమాలి అఫార్స్-సోమాలి ఇస్సాస్ మధ్య ఉన్న విభేదాలు... దేశప్రగతికి అడ్డుపడతాయనే అంచనా ఉండేది. అయితే స్వాతంత్య్రానంతరం ఈ రెండు వర్గాల మధ్య ‘అధికార మార్పిడి’ ఫార్ములా విజయవంతంగా అమలుకావడంతో... ఆ అనుమానాలు, అంచనాలేవీ నిజం కాలేదు. 1991లో దేశంలో అంతర్యుద్ధ పరిస్థితులు ఏర్పడినప్పటికీ ఆ తరువాత జరిగిన చర్చలతో శాంతియుత వాతావరణం ఏర్పడింది.
820 రకాల మొక్కలు, 360 రకాల పక్షులు, 66 రకాల క్షీరదాలు ఉన్న జిబౌటి జీవవైవిధ్యానికి కొంగు బంగారంగా నిలిచింది. గోడ పర్వతాల్లోని ‘డే ఫారెస్ట్ నేషనల్ పార్క్’ జీవవైవిధ్యానికి మరో ప్రత్యేకతగా నిలిచింది. జిబౌటిలో సంగీతానికి మంచి ప్రాచుర్యం ఉంది. మొదట్లో ఇతర ప్రాంతాల ప్రభావం ఉన్నప్పటికీ ఆ తరువాత తనదైన శైలితో ప్రత్యేకతను నిలుపుకుంది. జిబౌటి కవిత్వానికి ఘనమైన చరిత్ర ఉంది. వంద పంక్తుల కవిత ‘గబె’కు జిబౌటి సాహిత్యంలో ప్రత్యేకత ఉంది.
కొద్దిపాటి వర్షపాతం వల్ల పండ్లు, కూరగాయలు మాత్రమే పండుతాయి. వ్యవసాయ ఉత్పత్తులను ఎక్కువగా ఇతరదేశాల నుండి దిగుమతి చేసుకుంటారు.
అంతర్యుద్ధం తాలూకు ప్రతికూల ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడినప్పటికీ, ఆ తర్వాత రాజకీయ స్థిరత్వం ఏర్పడడంతో పరిస్థితి కుదుటపడింది. స్వాతంత్య్రనంతరం జిబౌటి ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. నిరుద్యోగం, పేదరికం సమస్యలు సవాళ్లుగా నిలిచాయి. ఈ విషయం ఎలా ఉన్నప్పటికీ ‘సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ ఇన్ ది వరల్డ్’ జాబితాలో చోటు చేసుకుంది.
నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉన్న దేశాలలో జిబౌటి ఒకటి. రాజధాని జిబౌటి ఆఫ్రికా ఖండంలోని చిన్న పట్టణాలలో మూడవది. ఫ్రెంచ్, ఇస్లాం సంప్రదాయం, సంస్కృతుల ప్రభావం భవననిర్మాణ కళలో కనిపిస్తుంది. ఉప్పునీటి సరస్సు లక్ అసల్ ‘ఉప్పు’ గృహ అవసరాలకు ఉపయోగపడడమే కాదు వాణిజ్యానికి కూడా ఉపయోగపడుతుంది.
జిబౌటిలో మాత్రం క్రిస్మస్ను జనవరి 7న జరుపుకుంటారు. సూర్యోదయం తరువాత ట్యాక్సీ రేట్లు పెరుగుతాయి.
నిర్మాణాలు, వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్, సాల్ట్మైనింగ్, పెట్రోలింగ్ రిఫైనరీ... మొదలైనవి దేశంలో ప్రధాన పరిశ్రమలు.

About Djibouti….
In the horn of African Countries, Djibouti is one. Capital of the country is Djibouti city. Two third of the population is living in capital city. French and Arab languages are the main languages. This people also speak Somali and Afar. Currency of this country is Djibouti francs. Literacy is 68%. After capitals, major cities are major Obock, Tadjoura, Ali Sabieh, Arta, and Dikhil. Majority people follows Islam.
Djibouti is bounded by Eritrea in the North, Djibouti to the to the South East Somalia.
Djibouti was ruled by French for a long time. In the year 1977, on June, this country gained independence.
820 numerous types of plants, 360 bird species, 66 types of mammals are found here.
Due to limited arable land in Djibouti, agriculture is not suitable for this country. Small quantity of vegetables and dates will be yield. These people imports agricultural, and consumer products from other countries
Djibouti is one of the ‘Safest Investment destination in the world’. Poverty and unemployment are major problems in this country.
Djibouti people, celebrates Christmas on January 7.