ఈజిప్ట్ రాజధాని కైరో, విస్తీర్ణం 10,10,407 చదరపు కిలోమీటర్లు. జనాభా: 9,16,70,000 (2019 సం) ఈ దేశ కరెన్సీఈజిప్షియన్ పౌండ్. వీరి భాష అరబిక్. మధ్యప్రాచ్య దేశాల్లో ఎక్కువ జనాభా ఉన్న దేశం ఇది. జనాభాలో 90 శాతం మంది ముస్లింలే.
ఈజిప్ట్ అనగానే గుర్తొచ్చేవి పిరమిడ్లే. ఆ ప్రాంతాన్ని పాలించిన రాజులు, వారి కుటుంబాల్లో చనిపోయిన వారి శరీరాల్ని భద్రపరిచేందుకు వీటిని నిర్మించేవారు. 130కి పైగా పిరమిడ్లు ఉన్నాయిక్కడ. ఇక్కడున్న పిరమిడ్లన్నింటిలో ఖుఫు పిరమిడ్ అతి పెద్దది. అన్నింటికీ నాలుగు తలాలు ఉంటే దీనికి ఎనిమిది తలాలుంటాయి. దీన్నే గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా అని కూడా అంటారు. దీని పొడవు 460 అడుగులు. అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కంటే ఇదే పెద్దది.
టోలెమిక్ రాజవంశంలో చివరిగా ఈజిప్టును పరిపాలించిన రాణి క్లియోపాత్ర. అందగత్తె అయిన ఆమె అంతర్యుద్ధంతో రగిలిపోతున్న రాజ్యంలో శాంతిని నింపి చరిత్రలో నిలిచిపోయింది ఈ దేశంలో పిల్లుల్ని పూజిస్తారు. గతంలో వాటిని చంపడం నేరం. ప్రమాదవశాత్తూ అలా జరిగినా ఇక్కడ కఠిన శిక్షలుండేవి. వాటిని తమ అదృష్ట దేవతలుగా భావించేవారు.
ప్రాచీన కాలంలోనే ఈ దేశంలో రాసేందుకు లిపి ఉంది. వారు అప్పట్లోనే రాళ్లతో తయారు చేసిన తలగడల్ని వాడేవారు. మనం ఇప్పుడు ఆడే బోర్డ్‌గేమ్‌లు వారికి రెండు వేల ఏళ్ల క్రితమే ఉన్నాయి. ప్రపంచంలోనే పాత చొక్కా ఇక్కడ దొరికింది. ఇది 5000 ఏళ్ల క్రితం నాటిదట.
కాగితం, కలం, తాళాల్ని తొలుత వీరే తయారుచేశారు. ఎప్పటి నుంచో వీరు టూత్‌పేస్ట్‌ని కూడా తయారుచేసుకుని ఉపయోగించేవారు. పడవల్ని మొట్టమొదట తయారుచేసిందిక్కడే. క్రీ.పూ. 3000 సంవత్సరాల్లోనే వీరు వాటిలో ప్రయాణించి వ్యాపారాలు చేసేవారు.
అతి పొడవైన నైలు నది ఈ దేశంలోనే కాకుండా పది దేశాల్లో ప్రవహిస్తోంది. దీని పరీవాహక ప్రాంతాల్లోనే పంటలు పండిస్తారు. ఇక్కడ వర్షపాతం చాలా తక్కువ కావడంతో మిగిలిన ప్రాంతాలు ఎడారుల్ని తలపిస్తాయి.
ఇక్కడి అలెగ్జాండ్రియాలో ఓ గ్రంథాలయం ఉంది. అంతర్జాల వెబ్‌సైట్లలో ఉండే ప్రతి వెబ్‌సైట్ పేజీలు ఇందులో ఉంటాయిట. 1996లో దీన్ని ప్రారంభించారు. ప్రపంచంలో అంతర్జాలాన్ని ఎక్కువగా వాడే దేశాల్లో ఇది 21వ స్థానంలో ఉంది.
ప్రాచీన ఈజిప్షియన్లు, 2000 మందికి పైగా దేవుళ్లను కొలిచేవారు. స్త్రీలు, పురుషులు మేకప్ వేసుకునేవారు. సూర్యరశ్మి నుంచి రక్షణ కోసం కళ్ల దగ్గర రాగి లేదా సీసంతొ తయారు చేసిన నల్లటి రంగు వేసుకునేవారు. మరుగుజ్జులు ఈ దేశంలో గౌరవింపబడతారు. వారిని చులకనగా చూడరు. పెళ్లిళ్ల సమయంలో ఉంగరాలు మార్చుకునే సంప్రదాయం ఇక్కడిదే.
Egypt country, situated in Northeastern corner of Africa. Egypt’s capital is Cairo. Territory is 10,10, 407 square kilometers. Currency is Egyptian Pounds. Official language is Arabic. 90% of the people belongs to Muslim religion. In the middle east Egypt is most populous country. In the Arab and Muslim world Egypt became intellectual and cultural center.
Egypt is famous for pyramids. Pyramids were built to preserve the dead bodies of pharaohs and their concerts, who ruled this region. 130 pyramids are here. Khufu pyramid is larger than other pyramids. This pyramid is larger than the Statue of Liberty in America.
Queen Cleopatra, beautiful lady, hails from Ptolemaic dynasty, who finally ruled Egypt eradicated civil war in Egypt and established peace.
In the ancient time these people used script to write. In those days they used pillows, which are made with stone. Papers, pens and locks are invented in this country only.
The longest river Nile (father of rivers) in Africa flows in this country along with ten other countries. This river is main water resources. Crops are cultivated in the catchment of Nile River. All of Egypt would be desert without River Nile. The rain fall is very low and rest of areas seems to be deserts.
Ancient Egyptians worshiped about 2000 gods. Dwarfs are respected in this country.
Egypt’s tourism industry and gas, oil exports remains a key part of this country’s economy.